కొంత మంది భార్యాభర్తలు చిన్న చిన్న కారణాలకే బంగారం లాంటి తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. ఆలుమగల మధ్య గొడవలు, మనస్పర్థలు రావడం సహజమైనా వాటిని పరిష్కరించుకొనే ప్రయత్నం చేయకుండా క్షణికావేశంలో తీవ్రమైన నిర్ణయం తీసుకుంటున్నారు. పైగా ఇటీవల వర్క్ ఫ్రం హోం కారణంగా భార్యాభర్తలిద్దరూ ఇంట్లోనే ఉండడం కూడా ఇలాంటి పరిస్థితులకు కారణం అవుతోంది. లాక్ డౌన్ ప్రారంభం అయిన నాటి నుంచి భార్యాభర్తల మధ్య గొడవల కేసులు, గృహ హింస కేసులు ఎక్కువగా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని ఓ జంట చిన్నపాటి మనస్పర్థలకే తమ బంగారం లాంటి భవిష్యత్తును నాశనం చేసుకుంది.


సొంత ఊరికి వెళ్లే విషయంలో ఇద్దరు భార్యాభర్తల మధ్య నెలకొన్న వివాదం ఆ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని చనిపోయేందుకు దారి తీసింది. హైదరాబాద్‌లోని కూకట్‌ పల్లి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సిద్దిపేట పట్టణానికి చెందిన బ్రహ్మానందం, రాజమణి కుటుంబం కూకట్‌పల్లి వివేకానంద నగర్‌లో నివాసం ఉంటోంది. వీరికి ఓ కుమార్తె ఉంది. పేరు ప్రియాంక. 28 ఏళ్ల ప్రియాంకకు హన్మకొండకు చెందిన మందుగుల అన్వేష్‌ అనే వ్యక్తితో గత సంవత్సరం నవంబరు నెలలో పెళ్లి చేశారు. వీరు అప్పటి నుంచి కూకట్‌ పల్లి వై జంక్షన్‌లోని స్వాన్‌ లేక్‌ అనే గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. ఇద్దరూ సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగులే కావడంతో.. ఇంటి నుంచే పని చేస్తున్నారు. 


Also Read: Gold-Silver Price: ఎగబాకిన పసిడి ధర.. ఏకంగా రూ.300, వెండి కూడా అదే దారిలో.. తాజాగా ఇలా..


దీంతో వారి మధ్య చిన్న చిన్న తగాదాలు తలెత్తాయి. తరచూ వివిధ విషయాల్లో మనస్పర్థలు తలెత్తాయి. వారాంతం కావడంతో శుక్రవారం రోజు భార్యను హన్మకొండకు రావాల్సిందిగా అన్వేష్‌ కోరాడు. అప్పటికే కొన్ని గొడవలు ఉండడంతో ఆమె రానని తెగేసి చెప్పేసింది. ఈ విషయంలో వారి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే ఇద్దరూ రాత్రికి వేర్వేరు గదుల్లో నిద్రపోయారు. భర్త అన్వేష్ ఉదయం లేచి చూసే ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. తన భార్య ప్రియాంక ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుని కనిపించింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. భార్య ప్రియాంక తండ్రి ఫిర్యాదు ఇచ్చిన మేరకు భర్త అన్వేష్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.


Also Read: Komatireddy Congress : ఉంటే ఉండు...పోతే పో ! కోమటిరెడ్డికి మధుయాష్కీ ఫైనల్ వార్నింగ్ !


Also Read: ByPolls : మమతాకు స్వీట్.. ఈటలకు షాక్..! ఉపఎన్నికలపై ఈసీ కీలక ఆదేశాలు..!