తూర్పుగోదావరిజిల్లా రాజానగరంలో ఇంజనీరింగ్ విద్యార్థిని కిడ్నాప్ కలకలం రేపిన విషయం తెలిసిందే. ఇంటి నుంచి కళాశాలకు ఓ యువతి బయల్దేరింది. మార్గమధ్యలో దుండగులు కిడ్నాప్ చేశారు అనుకున్నారంతా. కాసేపటికి యువతి తండ్రికి ఫోన్ వచ్చింది. రూ. 5 లక్షలు ఇస్తేనే.. మీ కుమార్తెను వదిలిపెడతాని అవతలి వైపు నుంచి చెప్పారు. డబ్బులు తీసుకురాకపోతే చంపేస్తామని బెదిరింపులు వచ్చాయి.
కుమార్తెకు ఏమైన అవుద్దేమోనని అనుకున్న తల్లిదండ్రులు.. రాజానగరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా.. ఓ యువకుడు.. అమ్మాయిని బైక్ మీద తీసుకెళ్లినట్టు గుర్తించారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా.. కేసు దర్యాప్తును మెుదలుపెట్టారు.
విచారణలో భాగంగా యువతి కోసం పోలీసులు, కుటుంబ సభ్యులు కొన్ని ప్రాంతాలు తిరిగారు. అప్పటికే.. ప్రేమవ్యవహారమేమోనని పోలీసులు అనుకున్నారు. బైక్ మీద వెళ్లిన విజువల్స్ చూస్తుంటే.. ఇష్టంతోనే వెళ్లిందేమోనని అనుమానం కలిగింది. పోలీసులు ఆ కోణంలోనే విచారణ చేశారు.
అయితే ఎట్టకేలకు.. వాళ్లు ఉన్న ప్రదేశాన్ని కనిపెట్టారు పోలీసులు. యువతికి స్నాప్ చాట్ ద్వారా పరిచయమైన ఫణీంద్ర అనే వ్యక్తి లాంగ్ డ్రైవ్‌కు వెళ్దామని యువతికి చెప్పాడు. ఆమె కూడా సరే వెళ్దాం అని చెప్పి వెళ్లింది. తీసుకెళ్లాక.. భీమవరం బులుసుమూడిలోని ఓ రూమ్‌లో యువతిని బంధించాడు ఫణీంద్ర. ఆమె కాళ్లు చేతులు కట్టేసి చేతిపై కత్తితో దాడి చేశాడు. తాను చేసిందంతా.. వీడియో రికార్డు చేశాడు. యువతి తల్లిదండ్రులకు పంపించి డబ్బులు డిమాండ్ చేశాడు. భీమవరంలో దొరికిన ఫణీంద్రను అరెస్టు చేసిన పోలీసులు అతడితో నిజం చెప్పించారు.
Also Read: Warangal Crime: బెయిల్ పూచీకత్తు కోసం ఫోర్జరీ సంతకాలు... కోర్టులను మోసం చేస్తున్న ముఠా అరెస్టు
Also Read: Indrani Case : షీనా బోరా బతికే ఉందట.. ఏళ్ల తర్వాత ట్విస్ట్ ఇస్తున్న ఇంద్రాణి !
Also Read: చిన్నారులు సినిమాల్లో నటించాలంటే.. కలెక్టర్ పర్మిషన్ ఉండాల్సిందే.. రెమ్యూనరేషన్ పైనా క్లారిటీ
Also Read: అమ్మాయి పెళ్లి వయసు 18 కాదు 21 ఏళ్లు.. త్వరలోనే పార్లమెంట్‌లో చట్టం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి