కేంద్ర చట్టానికి అనుగుణంగా.. రాష్ట్రంలో బాల కార్మిక చట్టాన్ని సవరించారు. దీనిపై కార్మిక శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. 14 ఏళ్ల లోపు చిన్నారులను పనిచేయించుకుంటే కఠిన చర్యలు ఉండనున్నాయి. శిక్ష ఏంటో తెలుసా? ఆర్నెళ్ల నుంచి ఏడాది జైలుశిక్ష ఉంటుంది. అంతేకాదు.. 20 నుంచి 50 వేల రూపాయల వరకు జరిమానా కూడా విధిస్తారు.


తల్లిదండ్రులే పనికి పంపించారు కదా.. అనుకోకండి. పిల్లలను పనికి పంపిస్తే.. తల్లిదండురుకు కూడా శిక్ష ఉంటుంది. అయితే చదువులు ఎలాంటి ఆటంకం లేకుండా.. తల్లిదండ్రులకు సహాయంగా ఉండొచ్చు. కానీ.. హానికరమైన పనులు, ఆదాయం వచ్చేలా తయారీ రంగం, ఉత్పత్తి, రిటైల్ చైన్ సరఫరా పనులకు చిన్నారులను ఉపయోగించొద్దు. 


పాఠశాల సమయాలతో పాటు రాత్రి ఏడు నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు చిన్నారులు పని చేయకూడదు. దీనిపై పర్యవేక్షణకు.. ఆయా జిల్లా కలెక్టర్ నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ కమిటీ ఉంటుంది. అనుమతి లేకుండా.. 30 రోజులపాటు పిల్లలు పాఠశాలకు రాకపోతే.. ప్రధానోపాధ్యాయుడు కూడా బాధ్యతగా ఉండాలి. ఈ విషయాన్ని నోడల్ ఆఫీసర్ కు చెప్పాలి
 
చిన్నారుల కళారంగంలో పని చేసిన దానికి నిబంధనలు ఉన్నాయి. సినిమాలో నటించేందుకు కలెక్టర్ల నుంచి అనుమతి తీసుకోవాలి. ఈ బాధ్యత నిర్మాత లేదా దర్శకుడిదే. రోజుకు ఐదు గంటలకు కంటే ఎక్కువ పని చేయకూడదు. అంతేకాదు.. బ్రేక్ లేకుండా.. చిన్నారులను మూడు గంటలకు మించి.. చిత్రీకరణలో పని చేయించొద్దు. విద్యార్థుల చదువుకు నిర్లక్ష్యం లేకుండా కూడా చూడాలి. 27 రోజుల కంటే ఎక్కువగా.. చిన్నారులను చిత్రీకరణలో అనుమతించరు. 


ఒకవేళ సినిమాలో ఐదు మంది పిల్లలు నటించాల్సి వస్తే.. వారిని చూసుకునేందుకు ఒక వ్యక్తి తప్పకుండా ఉండాలి. పిల్లలకు వచ్చే ఆదాయాన్ని ఇంట్లోకి వాడుకుంటాం అంటే కుదరదు. కనీసం..25 శాతం వారి పేరు మీదనే.. ఫిక్స్ డ్ డిపాజిట్ చేయాలి. మేజర్ అయ్యాక ఆ మొత్తం వాళ్లకి చెందేలా చూడాలి. పిల్లలకు నచ్చనిదాంట్లో యాక్టింగ్ చేయించకూడదు.


Also Read: Pushpa Movie: 'పుష్ప'కు కెసిఆర్ ప్రభుత్వం చేస్తున్నది పెద్ద సాయమే...


Also Read: Inter Results 2021: తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదల... రిజెల్ట్స్ కోసం ఇలా చెక్ చేసుకోండి


Also Read: Hyderabad Containment Zone: హైదరాబాద్‌లో మళ్లీ కంటైన్మెంట్ జోన్.. ఈ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటన


Also Read: Nizamabad: గల్ఫ్ బాధితుడికి ఎమ్మెల్సీ కవిత చేయూత.. సొంత ఖర్చులతో స్వగ్రామానికి..


Also Read: Kamareddy: ఈ ఊర్లో లిక్కర్ అమ్మితే రూ.లక్ష, కొనాలంటే రూ.50 వేలు.. నాలుగేళ్ల నుంచి ఇంతే..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి