Inter Results 2021: తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదల... రిజెల్ట్స్ కోసం ఇలా చెక్ చేసుకోండి

తెలంగాణలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాలు విడుదల అయ్యాయి. ఫస్ట్ ఇయర్ పరీక్షల్లో 49 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

Continues below advertisement

తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. గురువారం మధ్యాహ్నం ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఫస్ట్ ఇయర్ ఫలితాలను వెల్లడించారు. ఇంటర్ ఫస్టియర్ లో మొత్తం 49 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. బాలికలు 56 శాతం, బాలురు 42శాతం ఉత్తీర్ణత సాధించినట్లు బోర్డు అధికారులు తెలిపారు. ఈ ఫలితాలను ఇంటర్‌ బోర్డు వెబ్‌సైట్‌లో చూడవచ్చు.  రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4,59,242 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 2,24,012 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ఇంటర్‌ బోర్డు అధికారులు తెలిపారు. ఇంటర్ ఫలితాలను tsbie.cgg.gov.in వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా http://results.cgg.gov.in లేదా http://examresults.ts.nic.in  ఫలితాలు చూసుకోవచ్చు. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు అక్టోబ‌ర్ 25, 2021 నుంచి న‌వంబ‌ర్ 3, 2021 వ‌ర‌కు నిర్వహించారు. ఈ ఏడాది ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలకు 4,59,242 విద్యార్థులు హాజరయ్యారు. 

Continues below advertisement

Also Read: తెలుగు చదవలేరు.. ఇంగ్లీష్‌లో మాట్లడలేరు... కరోనాతో అటకెక్కిన చదువులు

ఛాయిస్ ప్రశ్నలే అధికం

ముందు ఇంటర్ పరీక్షలను 2020 ఏప్రిల్ నెలలో నిర్వహించాలని అధికారులు భావించారు. కానీ షెడ్యూల్ ప్రకారం మార్చి 23 నుంచి పరీక్షలు జరగాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా పరీక్షలు నిర్వహించలేదు. అయితే ఎట్టకేల‌కు అక్టోబ‌ర్ 25వ తేదీ నుంచి న‌వంబ‌ర్ 3వ తేదీ వ‌ర‌కు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించారు. విద్యాసంవత్సరం తక్కువ రోజులు జరిగిన కారణంగా ఎక్కువ చాయిస్ ఆధారిత ప్రశ్నలతో పరీక్షలు నిర్వహించారు. అన్ని సబ్జెక్టుల్లోనూ చాయిస్‌ ఎక్కువగా ఉండేలా ఇచ్చారు. కరోనా కారణంగా ఫస్టియర్‌ పరీక్షలు లేకుండా విద్యార్థులను ద్వితీయ సంవత్సరంలోకి అనుమతించారు. విద్యార్థులు సులభంగా ఉత్తీర్ణులయ్యే విధంగా పరీక్షలు నిర్వహించారు. సులభంగా జవాబు రాసే వీలు ఉండే విధంగా ప్రశ్నలు ఇచ్చారు. ఈ సారి ప‌రీక్షల‌కు 70 శాతం సిలబస్‌ లోంచే ప్రశ్నాపత్రం ఇచ్చారు. 40 శాతం ఐచ్ఛిక ప్రశ్నలు ఇచ్చారు. ఈ ప‌రీక్షల‌కు వ్యాక్సినేషన్‌ పూర్తయిన ఇన్విజిలేటర్లను మాత్రమే అనుమతించారు.  

Also Read: Miss Universe: మన ముగ్గురు విశ్వ సుందరుల చదువేంటో తెలుసా?

Also Read: UGC Net 2021: యూజీసీ నెట్ సెకండ్ ఫేజ్ పరీక్ష తేదీలు విడుదల.. అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సి విషయాలివే

Also Read: CTET Exam 2021: సీటెట్‌ హాల్‌టికెట్‌ మీకు రాలేదా.. అప్లికేషన్ సరిదిద్దుకోండిలా

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి  

Continues below advertisement