ఆంధ్రప్రదేశ్‌లో 24 గంటల వ్యవధిలో 33,043 పరీక్షలు నిర్వహించారు. ఇందులో 148 కొవిడ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. కొవిడ్‌ వైరస్ కారణంగా చిత్తూరు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు. ఇప్పటి వరకు మెుత్తం.. కొవిడ్‌ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,474కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 152 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో ఇప్పటివరకు 20,59,131 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 1,821 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపంది.






ఒమిక్రాన్ కేసులు..


దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 73 కేసులు నమోదయ్యాయి. బంగాల్, రాజస్థాన్, గుజరాత్, దిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు ఒమిక్రాన్ వ్యాపించింది. బంగాల్‌లో బుధవార ఉదయం తొలి కేసు నమోదుకాగా, తమిళనాడులో నిన్న సాయంత్రం నమోదైంది. మహారాష్ట్ర, కేరళలో నాలుగు చొప్పున ఒమిక్రాన్ కేసులు బుధవారం వచ్చాయి. మహారాష్ట్రలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 32కు చేరింది.


వార్నింగ్..


WHO ప్రాథమిక ఆధారాల ప్రకారం.. ఇండియాలో తీసుకున్న Covid-19 వ్యాక్సిన్లు ఈ వేరియెంట్‌పై తక్కువ ప్రభావం చూపుతాయి. ఇది రీఇన్‌ఫెక్షన్ ప్రమాదాన్ని కలిగి ఉన్నట్లు తెలిపింది. కోవిడ్ వ్యాక్సిన్‌లు లేదా గతంలో ఏదైనా ఇన్‌ఫెక్షన్ చికిత్స కారణంగా పొందిన రోగనిరోధక శక్తిని ఒమిక్రాన్(Omicron) ఎంతవరకు తప్పించుకోగలదో తెలుసుకోడానికి మరింత డేటా అవసరమని పేర్కొంది. అయితే, వ్యాక్సిన్ తీసుకున్నా.. ఒమిక్రాన్ బారిన పడే అవకాశాలు ఉన్నట్లు WHO స్పష్టం చేసింది. GISAID గ్లోబల్ సైన్స్ డేటాబేస్‌లో రిజిస్టర్ చేసిన డెల్టా వేరియెంట్ల సీక్వెన్స్‌ల శాతం ఇతర ఆందోళనకర వేరియంట్‌లతో పోల్చితే ఈ వారం క్షీణించిందని పేర్కొంది. డెల్టా(Delta) వేరియంట్ ఇప్పటికీ ఆందోళనకర స్థాయిలోనే ఉందని, ప్రజలు మాస్క్, శానిటైజేషన్ తప్పకుండా పాటించాలని హెచ్చరించింది.


Also Read: Bihar Special Status : మళ్లీ ప్రత్యేకహోదా డిమాండ్ లేవనెత్తుతున్న నితీష్ కుమార్... పరిశీలిస్తామన్న నీతి ఆయోగ్ వైస్‌చైర్మన్ వ్యాఖ్యలతో కలకలం !


 Also Readd:Kadapa News : ఇడుపులపాయ టు తాడేపల్లికి పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు ! వాళ్లకేం కష్టం వచ్చిందంటే ?