షీనా బోరా హత్య కేసు. కొన్నేళ్ల క్రితం చాలా రోజుల పాటు దేశం మొత్తం ఆసక్తి రేకెత్తించిన కేసు. ఇప్పుడీ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. అసలు హత్యకు గురయిందని భావిస్తున్న షీనా బోరా బతికే ఉందట. సీబీఐ ఆమె ఆచూకీ కనిపెట్టాలని ఆమె తల్లి, షీనా బోరా హత్య కేసులో చాలా రోజులుగా జైల్లో ఉన్న ఇంద్రాణి ముఖర్జీయా అంటున్నారు. ఈ మేరకు సిబిఐ డైరెక్టర్‌కు లేఖ రాశారు. కాశ్మీర్‌లో షీనా బోరాను కలిశానని జైలులో ఉన్న తనను ఇటీవల ఓ మహిళ కనిపించి చెప్పిందని లేఖలో చెప్పారు. కాశ్మీర్‌లో షీనా బోరాను వెతకాలని ఆమె సిబిఐని కోరారు. లేఖతో పాటు సిబిఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు.
Also Read: ఓఆర్ఆర్ వద్ద ఇద్దరు యువకులు, యువతి.. ముగ్గురూ కలిసి కారులో.. అడ్డంగా బుక్
ఇంద్రాణీ ముఖర్జీయా షీనా బోరా హత్య కేసులో 2015లో అరెస్టైన నాటి నుండి ముంబయిలోని బైకుల్లా జైలులోఉన్నారు. బెయిల్ దరఖాస్తు చేసుకోగా.. గత నెలలో ముంబయి హైకోర్టు తిరస్కరించింది. ఇంద్రాణి ముఖర్జీ డ్రైవర్ శ్యామ్‌వర్ రాయ్ గన్‌తో పట్టుబడటంతో షీనా బోరా హత్య ఉదంతం బయటకు వచ్చింది. 2012లో తన సోదరిగా చెప్పుకుంటున్న షీనా బోరాను.. ఇంద్రాణీ ముఖర్జీయా గొంతు కోసి హత్య చేసినట్లు శ్యాంవర్ పోలీసులకు తెలిపాడు. అయితే విచారణలో షీనా బోరా.. ఇంద్రాణి మొదటి కుమార్తె అని తేలింది.
Also Read: Kurnool Onion Market: గిట్టుబాటు ధరలేక ఆగ్రహించిన ఉల్లి రైతు... పెట్రోల్ పోసి ఉల్లిబస్తాలకు నిప్పు
మొదటి వివాహం విఫలం కావడంతో ఇంద్రాణీ తన పిల్లలను తల్లిదండ్రుల వద్ద విడిచిపెట్టి.. మీడియా ఎగ్జిక్యూటివ్ పీటర్ ముఖర్జీయాని రెండో వివాహం చేసుకున్నారు. షీనా కాస్త పెద్దయిన తర్వాత ముంబై వచ్చి ఇంద్రాణీని కలిశారు. అయితే ఇంద్రాణి ఆమెను తన రెండో భర్తకు కూతురుగా కాకుండా సోదరిగా పరిచయం చేసింది. పీటర్ ముఖర్జీయాకు మొదటి భార్య ద్వారా ఓ కుమారుడు ఉన్నారు. ఆ కుమారుడు షీనాబోరాతో సహజీవనం చేశారు. ఈ విషయం నచ్చని ఇంద్రాణీ ప తన మాజీ భర్త సంజయ్ ఖన్నా సాయంతో కుమార్తె హత్య చేసినట్లుగా గుర్తించారు.
Also Read: ఫుల్ గ్యాస్‌తో ఉన్న సిలిండర్ల లారీ బోల్తా.. ! ఒక్కటి లీక్ అయినా పెను విపత్తే.. కానీ
షీనా విదేశాలకు వెళ్లిపోయిందని ఇంద్రాణీ అందర్నీ నమ్మించారు. కానీ శ్యామ్ వర్ పట్టుబడటంతో షీనా హత్య బయటపడింది. షీనా బోరాను ముంబయిలోని బాంద్రాలో గొంతుకోసి చంపి, ఆమె మృతదేహాన్ని పడేసేందుకు పొరుగున ఉన్న రారుగఢ్ జిల్లాకు తీసుకు వెళ్లిందని దర్యాప్తు అధికారులు తేల్చారు. షీనా బోరా కేసు రాజకీయ అంశం కూడా అయింది. మీడియాలో పెట్టుబడుల అంశంలో వారు కొంత మంది కాంగ్రెస్ నేతలకు లంచాలు ఇచ్చినట్లుగా చెప్పడం కూడా సంచలనం అయింది. ఇలాంటి వాటి మధ్య ఇప్పుడు అసలు షీనా బోరా కేసు మళ్లీ మొదటికి వచ్చే అవకాశం కనిపిస్తోంది.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి