మానసిక వైకల్యం ఉన్న యువతిపై ఓ వృద్ధుడు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. చాక్లెట్ ఇస్తానని ఆశచూపి నిందితుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. జిల్లాలోని ఇల్లందు పట్టణానికి చెందిన మానసిక వైకల్యం కలిగిన 22 ఏళ్ల యువతిపై అదే గ్రామానికి చెందిన 58 సంవత్సరాల వ్యక్తి అత్యాచారం చేశాడు. నిందితుడి పేరు లాకావత్ దేవ్లా.
బాధితురాలి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 13వ తేదీ సోమవారం ఇంట్లో ఎవ్వరులేని సమయంలో ఒంటరిగా ఉన్న యువతికి లాకవత్ దేవ్లా అనే వ్యక్తి చాక్లెట్ ఇస్తానని, డబ్బులు ఇస్తానని ఆశ చూపి లైంగికదాడి చేశాడు. ఈ క్రమంలో ఆమె ఒక్కసారిగా గట్టిగా ఏడవడంతో చుట్టుపక్కల వారు ఇంట్లోకి వెళ్లారు. వారిని చూసిన నిందితుడు దేవ్లా అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఇల్లందు ఎస్‌ఐ కుమారస్వామి వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.
హైదరాబాద్‌లోనూ...
హైదరాబాద్‌లోని లంగర్ హౌస్ లో మైనర్ బాలికపై ఓ ఆటో డ్రైవర్ లైంగికదాడికి పాల్పడ్డాడు. తల్లిదండ్రులు దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేయగా పెద్ద నాయకుల ఒత్తిడితో పోలీసులు తమ కేసు గురించి పట్టించుకోవడం లేదని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
లంగర్‌హౌస్ ప్రాంతంలో నివాసముండే బాలిక ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుకుంటోంది. రోజూ స్కూల్‌కు వెళ్లి వచ్చే బాలికపై ఆటో డ్రైవర్ కన్ను పడింది. రోజూ బాలిక వెంటపడసాగాడు. ఆదివారం ఉదయం దుకాణానికి వెళ్లిన బాలికను స్నేహితుడితో కలిసి ఆటోలో ఓల్డ్ సిటీలోని ఓ ఇంటికి ఆటో డ్రైవర్ తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై తన స్నేహితుడితో కలిసి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి ఆటో నంబర్ ఆధారంగా బాలిక ఆచూకీ తెలుసుకున్నారు. అక్కడి నుంచి బాలికను భరోసా కేంద్రానికి తరలించగా పలుమార్లు లైంగిక దాడి జరిగినట్లు ఆమె తెలిపింది.
Also Read: నో అంటే నో..లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా ? వైఫ్ అయినా కట్ చేసేస్తుంది ! ఆ ఊళ్లో అదే జరిగింది !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి