మొన్నటి వరకు మద్యపానం మగవారికే సొంతం. ఇప్పుడు కాలం మారింది ఆడవారు పెగ్గుల మీద పెగ్గులు వేస్తున్నారట. ఈ విషయాన్ని మేము చెప్పడం లేదు.. ఓ కొత్త అధ్యయనం తేల్చి చెప్పింది. అలాగని అన్ని వర్గాల మహిళలను ఉద్దేశించి ఈ విషయం చెప్పడం లేదు, ఇంట్లో, ఉద్యోగంలో అధిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న మహిళలు, ఆ ఒత్తిడి నుంచి బయటపడేందుకు ఆల్కహాల్ కు అలవాటు పడుతున్నట్టు చెబుతున్నారు పరిశోధకులు. ఈ అధ్యయనం అరిజోనా స్టేట్ యూనివర్సిటీలో నిర్వహించారు. పరిశోధనా ఫలితాలను ‘సైకాలజీ ఆఫ్ అడిక్టివ్ బిహేవియర్స్’ అనే జర్నల్‌లో ప్రచురించారు.
ఈ పరిశోధన కోసం 105 మంది మహిళలు, 105 మంది పురుషులపై నిర్వహించారు. ల్యాబోరేటరీలో బార్ వాతావరణాన్ని సృష్టించారు. బార్టెండర్లు, బార్ టేబుళ్లు, కలర్ ఫుల్ లైట్లు ఇలా నిజమైన బార్ కు ఏదీ తక్కువ కాకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. అందులో ఒత్తిడితో కూడినవారు, ఎలాంటి ఒత్తిడి లేనివారిని విభజించారు. ఒత్తిడితో ఉన్న మహిళలు అధికంగా తాగడాన్ని గుర్తించారు. కొంతమంది ఒకటి లేదా రెండు పెగ్గులు తాగాక ఆపేస్తున్నారు. కానీ ఒత్తిడిలో ఉన్నవారు మాత్రం ఆల్కహాల్ కు బానిసలుగా మారుతూ నియంత్రణ లేకుండా తాగుతున్నారు. నియంత్రణ కోల్పోవడానికి ఒత్తిడి కారణం అవుతుందని అంటున్నారు అధ్యయనకర్తలు. ఒత్తిడి కారణంగా తాగిన వారిలో ‘బ్రీత్ బ్లడ్ ఆల్కహాల్ కంటెంట్’ ను ఉపయోగించి ఆల్కహాల్ ఎంత తాగారన్నది కొలిచి తెలుసుకుంది పరిశోధనా బృందం.
మద్యం సేవించడం వల్ల పురుషులతో పోలిస్తే మహిళలకే అధిక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. ఎందుకంటే సహజంగానే మగవారితో పోలిస్తే, ఆడవారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది, కాబట్టి ఒత్తిడిని తగ్గించుకోవడానికి వేరే మార్గాలు వెతుక్కోవడం చాలా మంచిదని చెబుతున్నారు వైద్య నిపుణులు.
Read also: ఈ ఏడాది మనదేశంలో ఎక్కువ మంది వెతికిన టాప్ 10 రెసిపీలు ఇవే
Read also: వైరస్‌ల నుంచి రక్షణనిచ్చే ఎండు అంజీర్ పండ్లు... తినకపోతే మీకే నష్టం
Read also: ఏడవండి.. గట్టిగా ఏడ్చి మీ బాధను తగ్గించుకోండి, కొత్తగా ఏడుపు గదుల ప్రాజెక్ట్
Read also: ఈ అలవాట్లున్నాయా... మీ గుండె ప్రమాదంలో పడినట్టే
Read also: త్వరగా బరువు తగ్గాలా? ఓట్స్‌ను ఇలా ఉపయోగించండి...
Read also: బ్రౌన్ రైస్, వైట్ రైస్, బాస్మతి రైస్... డయాబెటిస్ ఉన్న వారికి ఏ బియ్యం బెటర్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి