మేషంఈ రోజంతా సంతోషంగా ఉంటారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహించే అవకాశం ఉంది. స్నేహితులను కలుస్తారు. కార్యాలయ సహోద్యోగుల సహకారంతో మీ బాధ్యతలను పూర్తి చేయగలుగుతారు. కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి శుభసమయం. అప్పిచ్చిన మొత్తం తిరిగి పొందుతారు. వ్యాపారస్తులకు అనుకూల ఫలితాలు వస్తాయి. వృషభంఉద్యోగులు శుభవార్తలు వింటారు. అవివాహితులకు సంబంధాలకు సంబంధించిన సమాచారం అందుతుంది. కుటుంబ పెద్దలను జాగ్రత్తగా చూసుకోండి. ఈ రోజు మీరు ఆధ్యాత్మికతకు సంబంధించిన పనులు కొన్ని చేస్తారు. కొందరితో విభేదాలు కారణంగా ఒత్తిడికి గురవుతారు. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మిథునంఆధ్యాత్మిక ప్రయాణం చేస్తారు. బంధువులతో సంతోషంగా గడుపుతారు. ప్రమాదకర పనులు చేయొద్దు. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి. శత్రువుల వల్ల మీకు హాని కలుగుతుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. కర్కాటకం ఈ రోజంతా గందరగోళంగా ఉంటుంది. ఆరోగ్యం క్షీణించవచ్చు. మీ జీవిత భాగస్వామితో అన్ని విషయాలు చెప్పండి. తెలియని వ్యక్తుల ముందు రహస్య చర్చలు జరపొద్దు. ఎక్కడికైనా వెళ్లాల్సి రావొచ్చు. ఉద్యోగులు శుభవార్త వింటారు. బయటి ఆహారానికి దూరంగా ఉండండి. Also Read: ఒక భగవద్గీత - 108 ప్రశ్నలు- Part 1సింహంఈ రోజంతా సంతోషంగా ఉంటారు. బంధువులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆహారం తీసుకోవడంలో నియంత్రణ అవసరం. అనవసర ఖర్చులు నియంత్రించుకోండి. విద్యార్థులు మరింత శ్రమించాల్సి ఉంటుంది. పని ఒత్తిడి ఉంటుంది. ఏవైనా స్థిరాస్తులపై పెట్టుబడులు పెట్టొచ్చు. ప్రభుత్వానికి సంబంధించిన పనులు పూర్తవుతాయి.కన్యఈ రోజు మీ శత్రువులు యాక్టివ్ గా ఉంటారు...మీరు అప్రమత్తంగా ఉండండి. వ్యాపారులు కొన్ని పనులపై ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి మీకు పూర్తి సహకారం అందుతుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి.తులకొత్త వ్యక్తులతో సమావేశమవుతారు. ఉద్యోగులకు కార్యాలయంలో మరింత బాధ్యత పెరుగుతుంది. దినచర్యలో మార్పులు చేసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. రిస్క్ తో కూడిన పని చేయవద్దు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి. ఈ రోజు అనవసరమైన ఖర్చులుంటాయి. నిలుపుదల చేసిన మొత్తాన్ని తిరిగి పొందుతారు. వృశ్చికంసామాజిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. మీ ప్రతిష్ట పెరుగుతుంది. మీ స్వభావాన్ని అందరూ మెచ్చుకుంటారు. సంభాషణ సమయంలో జాగ్రత్తగా ఉండండి. కొత్త పనులు లాభిస్తాయి. రుణం మొత్తాన్ని తిరిగి పొందుతారు. స్నేహితుడిని కలుస్తారు. భగవంతుడి ఆరాధాన ద్వారా మనోధైర్యం పొందుతారు. పిల్లల వైపు నుంచి శుభవార్త అందుకుంటారు. Also Read: భగవద్గీత మా అమ్మ లేని లోటు తీర్చిందన్న స్వాతంత్ర్య సమరయోధుడెవరు… ఒక భగవద్గీత - 108 ప్రశ్నలు- Part 2ధనుస్సుఆరోగ్యంపై చెడు ప్రభావం ఉంటుంది. ప్రమాదకరమైన పనులు చేయొద్దు. మీ ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు. కుటుంబ సంబంధిత పనులపై బంధువులను కలిసేందుకు వెళ్లొచ్చు. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి. పాత మిత్రులను కలుస్తారు. ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీపై పెద్దల ఆశీస్సులు ఉంటాయి. మకరంఆర్థిక పరిస్థితి బావుంటుంది. కొత్తగా చేపట్టే పనినుంచి ప్రయోజనం పొందుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. బయటి ఆహారానికి దూరంగా ఉండండి. కుటుంబంలో పెద్దవారి ఆరోగ్యం క్షీణించవచ్చు. ఉద్యోగులు ప్రమోషన్ సంబంధిత సమాచారం పొందుతారు. అందరితో రహస్య చర్చలు జరపవద్దు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.కుంభంఈ రోజు సాధారణంగా ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. మీరు కొత్త ప్రాజెక్టులు అమలు చేయండి. దినచర్యలో మార్పు, ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. విద్యార్థులు విజయం సాధిస్తారు. యువకుల కెరీర్ పురోగమిస్తుంది. బంధువులను కలుస్తారు.మీనంకుటుంబ సభ్యుల ఆరోగ్యం క్షీణించవచ్చు. బంధువుల నుంచి కొన్ని విచారకరమైన వార్తలు వింటారు. వ్యాపారంలో లాభం ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు చూసుకుంటారు. విద్యార్థుల సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగులు బదిలీకి సంబంధించిన సమాచారం వినే అవకాసం ఉంది. Also Read: పుక్కిటి పురాణాలు కాదు… ప్రపంచాన్ని నడిపించే దిక్సూచీలు..Also Read: పర స్త్రీ పై మోజుపడుతున్నారా... అయిదే ఈ విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే....Also Read: ఆదిశంకరాచార్యులను అమ్మవారు ఎందుకు కబళించాలని అనుకున్నారు? పాచికలాటలో గెలిచిందెవరు?Also Read: చిన్న పిల్లలపై శని ప్రభావం ఉండదని ఎందుకంటారు...Also Read: ఆనందం ఎక్కడ దొరుకుతుంది… ఒక భగవద్గీత - 108 ప్రశ్నలు- Part 3
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి