విజయవాడ నుంచి ఆస్ట్రేలియాకు ఎఫిడ్రిన్ సరఫరా చేసిన కేసులో నిందితుడు అరుణాచలంను పోలీసులు కస్టడీకి తీసుకుని ప్రశ్నించారు. మూడు రోజుల కస్టడీలో అరుణాచ‌లం పోలీసుల‌కు  ఎలాంటి స‌మాచారం ఇచ్చాడ‌నేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉన్న రామన్ తంగేవి అనే పేరుపై పార్శిల్​ను పంపినట్లు విచారణలో నిందితుడు వెల్లడించినట్లుగా తెలుస్తోంది.  అరుణాచలంకు చెన్నై బర్మా బజార్​లో పరిచయమైన ఇద్దరు వ్యక్తులు పార్శిల్ ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. వారు ఎవరనే అంశంపై ప్రస్తుతానికి ఆరా తీస్తున్నారు తీగ లాగడానికి అవసరమైన సమాచారం లభించినట్లుగా పోలీసు వర్గాలు చెబుతున్నాయి.


ఏపీలో మరో పోలీసు సూసైడ్, ఎచ్చెర్లలో ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య!


అరుణాచలం ఇచ్చిన సమాచారంతో ఎఫిడ్రిన్ అక్రమ రవాణాలో కీలక నిందితుల వివరాలను పోలీసులు కొంత సేకరించారు. అయితే నిందితులిద్దరూ పరారీలో ఉన్నారు. వారి కోసం చెన్నైకు ప్రత్యేక పోలీసు బృందాలను పంపారు. ఈ కేసు బెజ‌వాడ పోలీసుల‌కు స‌వాల్ గా మారింది. విజ‌య‌వాడ న‌గ‌రంలో డ్ర‌గ్స్ ర‌వాణా అవుతున్న విష‌యం సీబీఐ అధికారులు చెబితే కానీ  స్దానిక పోలీసుల‌కు తెలియ‌లేదు.అది కూడా కొరియర్ అడ్రస్‌లో తేడా రావడం వల్లనే బయటపడింది. అత్యంత చాక‌చ‌క్యంగా నిందితులు ఆధార్ కార్డ్ ల‌ను ట్యాంపరింగ్ చేసి మ‌రి అక్రమ ప‌ద్దతిలో ర‌వాణా చేశారు. ఇది పోలీసుల‌కు స‌వాల్ గా మారింది. 


భోజనం లేదన్నారని హోటల్ పై దాడి, వీడియో షేర్ చేసిన చంద్రబాబు


ప్ర‌స్తుతానికి బెజ‌వాడ‌ పోలీసులు  ఆధార్ కార్డు ఎలా ట్యాంపరింగ్ చేశారన్న వివరాలు సేకరిస్తున్నారు.  ట్యాంప‌రింగ్ చేశార‌నే ఆరోప‌ణ‌ల పై కేసు న‌మోదు చేశారు. అలాగే డ్ర‌గ్స్ కు సంబందించిన ఆన‌వాళ్ళు ఎక్క‌డ వ‌ర‌కు వెళ్ళాయి.. ఎవ‌రెవ‌రికి అందాయి అనే విష‌యాలు వెలుగులోకి తీసుకువ‌చ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. బెజ‌వాడ కేంద్రంగా ధనిక వ‌ర్గానికి చెందిన యువ‌త‌ను టార్గెట్ గాచేసుకొని కొన‌సీమ‌తో పాటుగా కోస్తా జిల్లాల్లో కూడ డ్ర‌గ్స్ ను అందించార‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. 


అత్యంత పకడ్బందీగా జరుగుతున్న వ్యవహారం కావడంతో  ప్ర‌త్యేక బృందాల‌కు ఆధారాలు సేక‌రించ‌టం స‌వాల్ గామారింది. యువ‌త‌ను టార్గెట్‌గా చేసుకొని సాగిస్తున్న అక్ర‌మ దందా వ్య‌వ‌హ‌రంలో ఆన్ లైన్ ద్వారా తెర వెనుక చేతులు క‌లిపిన ముఠా ను తెర మీద‌కు తీసుకురావ‌టం అంత ఈజీకాదు డిజిట‌ల్ ఎవిడెన్స్ ద్వారా పోలీసులు పూర్తి స్దాయిలో ఆదారాలు సేక‌రించి తెర వెనుక ఉన్న వ్య‌క్తుల‌తో పాటుగా పాత్ర‌ధారులు , సూత్ర‌ధాదరులు ఎవ‌రనేదాన్ని తేల్చేందుకు ప్రయత్నిస్తున్నారు.