సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'కభీ ఈద్ కభీ దివాలీ'. ఫర్హాద్ సామ్‌జి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అలానే టాలీవుడ్ సీనియర్ నటుడు వెంకటేష్ కూడా ఈ ప్రాజెక్ట్ సైన్ చేశారు. రీసెంట్ గానే సినిమా షూటింగ్ ను మొదలుపెట్టారు. ఈ విషయాన్ని పరోక్షంగా వెల్లడించింది పూజా.  


సల్మాన్ ఖాన్ చేతికి ఎప్పుడూ ఉండే బ్రేస్‌లెట్‌ వేసుకుని కొత్త సినిమా షూటింగ్ అని చెప్పేసరికి అసలు విషయం అర్థమైంది. అలానే సల్మాన్ లుక్ కి సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. ఈ సినిమాలో పూజాహెగ్డే.. వెంకటేష్ కి చెల్లెలిగా కనిపించనుందట. 


వెంకీ, పూజా ఇద్దరూ ఈ సినిమాలో నటిస్తుండడంతో తెలుగునాట కూడా ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అవ్వడం ఖాయం. ముంబయిలోని విలేపార్లేలో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో ప్రస్తుతం షూటింగ్ జరుపుతున్నారు. త్వరలోనే వెంకీ ఈ సినిమా సెట్స్ లో జాయిన్ కానున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 30న ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 


Also Read: పూజా హెగ్డేతో వెంకటేష్, వరుణ్ తేజ్ సల్సా - 'ఎఫ్ 3'లో స్పెషల్ సాంగ్ ప్రోమో చూశారా?


Also Read: విజయ్ దేవరకొండ, సమంత సినిమా 'ఖుషి' ఫస్ట్ లుక్ ఇదిగో, రిలీజ్ ఎప్పుడంటే?