Anantapur Kidnap :   పెళ్లి చేసుకోవాలంటే ఏం చేయాలి? అమ్మాయిని చూసుకోవాలి. వాళ్ల తల్లిదండ్రులతో మాట్లాడుకోవాలి. తర్వాత అమ్మాయితో మాట్లాడుకోవాలి. కట్నాల గట్రా ఏమైనా ఎదురు ఇవ్వాల్సి ఉంటే ఇచ్చేసి పెళ్లి చేసుకోవాలి. అది పద్దతి. కానీ ఈ కష్టమంతా ఎందుకు ఆ పిల్లను కిడ్నాప్ చేసి తీసుకెళ్లి మెడలో తాళికట్టేస్తే పోలా అని ఓ మేధావి ఆలోచించాడు. వెంటనే తన లాంటి మేధావులైన ఇద్దరు స్నేహితుల్ని కలుపుకుని పెళ్లి చేసుకోవాలనుకున్న పిల్లను కిడ్నాప్ చేసేశారు. రెండు గంటల్లోనే నిజంగానే అతనికి పెళ్లయింది...కానీ అతను అనుకున్న పెళ్లి కాదు.. పోలీస్‌స్టేషన్‌లో పోలీసులు చేసిన పెళ్లి. 


మీరు ఇంటి బయట కారును పార్క్ చేస్తున్నారా? ఇలాంటి వాళ్లు కూడా ఉంటారు జాగ్రత్త!


అనతపురం జిల్లా రాప్తాడు మండలం చెయ్యేడు  కి చెందిన శివానంద  తన మరదలు వరుసయ్యే అమ్మాయిని ఇష్టపడ్డారు. ఆ పిల్లకు ఇష్టమో లేదో తెలియదు. అసలు ఆ అమ్మాయి మేజర్ కాదు. ఇంకా 17 ఏళ్లు మాత్రమే. అయినా సరే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. పెద్దలతో  ఆ అమ్మాయి తల్లిదండ్రులతో మాట్లాడించాడో.. వాళ్లు వద్దన్నారేమో కానీ ఇక ఆగలేక కిడ్నాప్ ప్లాన్ చేశారు. ఆ అమ్మాయి ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎత్తుకొచ్చేలా సినిమా స్టైల్లో ఇద్దరు ఫ్రెండ్స్‌కు కారు కూడా మాట్లాడిచ్చి పంపించాడు. ఆ ఇద్దరూ తమ స్నేహితుడు చెప్పినట్లుగా చేశారు. 


నటాషా నిషాలో - దేశ రక్షణ రహస్యాలు చేరవేసిన డీఆర్‌డీఎల్ ఉద్యోగి


జోగినేపల్లి గ్రామంలో ఉన్న అమ్మాయిని బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లిపోయారు. ఈ విషయం కాసేపటికే అందరికీ తెలిసింది. దీంతో తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కూడా కిడ్నాప్ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. వివరాలు బయటకు లాగి.. వెంటనే ట్రేస్ చేశారు. రెండు అంటే రెండు గంటల్లో అందర్నీ పట్టుకున్నారు. అసలు కిడ్నాపర్‌తో పాటు సహకరించిన ఇద్దరికి మర్యాదలు చేశారు. ఆ అమ్మాయిని తల్లిదండ్రులకు అప్పగించారు. ఆ అమ్మాయి మైనర్ కావడంతో అందరిపై పోక్సో చట్టం కింద కేసులు నమోదయ్యాయి. 


ఆలయంలో పెను విషాదం, కరెంట్ షాక్‌తో అక్కడికక్కడే ముగ్గురు వ్యక్తులు మృతి


మొత్తంగా తన వన్ సైడ్ లన్ స్టోరీని సినిమాల్లో హీరో రేంజ్‌లో ముగిద్దామనుకున్నాడు కానీ.. ఎక్కడా సక్సెస్ కాలేకపోయాడు. ఇప్పుడ జైలు పాలయ్యాడు. లవ్ స్టోరీల్లో క్రైమ్ యాంగిల్ అసలు ట్రై చేయకూడదని శివానంద లాంటి వాళ్లు అప్పుడప్పుడూ ఉదాహరణగా నిలుస్తూంటారు.