బాలీవుడ్ లో 'కాఫీ విత్ కరణ్' షో ఎంత పాపులరో తెలిసిందే. ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ ఈ సినిమాను ఈ షోని హోస్ట్ చేస్తుంటారు. అయితే మొన్నామధ్య ఈ షోని ఆపేస్తున్నట్లు సోషల్ మీడియాలో అనౌన్స్ చేసి హడావిడి చేశారు. ఆ తరువాత ఈ షో ఓటీటీలో వస్తుందని చెప్పారు. ఇప్పుడు ఈ ఓటీటీ వెర్షన్ కోసం సౌత్ సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తున్నారు కరణ్ జోహార్. ముందుగా విజయ్ దేవరకొండ, అనన్య పాండేలను ఇంటర్వ్యూ చేసినట్లు సమాచారం.
ఆ తరువాత స్టార్ హీరోయిన్ సమంతను ఇంటర్వ్యూ చేశారట. ఇటీవల ముంబైకి వెళ్లిన సమంత.. కరణ్ తో కలిసి ఈ షోలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయింది. అయితే ఈ షోలో తొలిసారి సమంత విడాకుల గురించి మాట్లాడినట్లు సమాచారం. ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న చైతు నుంచి విడిపోవడానికి గల కారణాల గురించి సమంత ఇప్పటివరకు చెప్పలేదు.
కానీ కరణ్ జోహార్ షోలో ఈ విషయం గురించి మాట్లాడిందని ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ ఇంటర్వ్యూపై ఎటెన్షన్ పెరిగిపోయింది. అయితే ఫైనల్ కట్ లో ఈ ఎపిసోడ్ ను ఉంచుతారో లేక తొలగిస్తారో చూడాలి. జూలైలో హాట్ స్టార్ లో ఈ షోని టెలికాస్ట్ చేయనున్నారు. సమంతతో పాటు చాలా మంది టాలీవుడ్ సెలబ్రిటీలను కరణ్ జోహార్ ఇంటర్వ్యూ చేయబోతున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, పూజాహెగ్డే ఇలా టాప్ సెలబ్రిటీలు ఈ షోలో పాల్గోనున్నారు. మరి సౌత్ సెలబ్రిటీలను టార్గెట్ చేసిన ఈ షో ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి!
Also Read : శోభితతో నాగచైతన్య డేటింగ్ - సమంత పుట్టించిన పుకారేనా?
Also Read : తక్కువ అంచనా వేయకండి - బాలకృష్ణ హీరోయిన్‌కు కరోనా