ABP  WhatsApp

Presidential Polls 2022: రాష్ట్రపతి రేసులో యశ్వంత్ సిన్హా- విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి

ABP Desam Updated at: 21 Jun 2022 04:16 PM (IST)
Edited By: Murali Krishna

Presidential Polls 2022: రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా నిలబడుతున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది.

రాష్ట్రపతి రేసులో యశ్వంత్ సిన్హా- విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి

NEXT PREV

Presidential Polls 2022: రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్‌ సిన్హాను నిలబెడుతున్నట్లు కాంగ్రెస్ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ప్రకటించారు.

  


టీఎంసీకి రాజీనామా


టీఎంసీ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్న యశ్వంత్ సిన్హా సడెన్‌గా ఆ పదవికీ, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మంగళవారం ఉదయం ట్విట్టర్‌ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.  







టీఎంసీలో మమతా బెనర్జీ నాకు ఇచ్చిన గౌరవానికి నేను కృతజ్ఞుడిని. ఇప్పుడు ఒక పెద్ద జాతీయ ప్రయోజనం కోసం, విపక్షాల ఐక్యత కోసం నేను పని చేయడానికి పార్టీ నుంచి తప్పుకోవాల్సిన సమయం వచ్చింది. ఆమె నా ఈ నిర్ణయాన్ని ఆమోదిస్తారని భావిస్తున్నాను.                                                               - యశ్వంత్ సిన్హా, కేంద్ర మాజీ మంత్రి


రేసులో 


యశ్వంత్ సిన్హా రాజీనామా చేయడంతో ఆయన రాష్ట్రపతి రేసులో ఉమ్మడి ప్రతిపక్ష అభ్యర్థిగా ఉన్నట్లు ఖరారైంది. అనంతరం విపక్ష నేతలు అధికారిక ప్రకటన చేశారు. ఇక ఎన్‌డీఏ ఎవరిని బరిలోకి దింపుతుందో చూడాలి. 


ప్రొఫైల్



  • బిహార్‌ పట్నాలో పుట్టిన యశ్వంత్‌ సిన్హా ఐఏఎస్‌ అధికారిగా, దౌత్య వేత్తగా పని చేశారు.

  • సర్వీసులో ఉండగానే రాజీనామా చేసి 1984లో యశ్వంత్ జనతా పార్టీలో చేరారు.

  • నాలుగేళ్లకు రాజ్యసభకు వెళ్లారు. జనతా దళ్‌ ప్రభుత్వంలో పార్టీ జనరల్‌ సెక్రటరీగా పని చేశారు.

  • ఆ తర్వాత కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగా ఏడాది పాటు పని చేశారు.

  • 1996లో భాజపా అధికార ప్రతినిధిగా పని చేసిన యశ్వంత్‌ సిన్హా 22 ఏళ్ల పాటు ఆ పార్టీలో ఉన్నారు.

  • 2018లో భాజపా పాలనను వ్యతిరేకించి 2021లో టీఎంసీలో చేరారు.


Also Read: Jammu Kashmir Encounter: పుల్వామాలో ఎన్‌కౌంటర్- ఓ ఉగ్రవాది హతం


Also Read: Maharashtra Politics: రసవత్తరంగా 'మహా' రాజకీయం- ఠాక్రే సర్కార్‌కు షాక్, గుజరాత్‌లో శివసేన ఎమ్మెల్యేలు!

Published at: 21 Jun 2022 12:44 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.