Nandyal Crime News: అప్పటికే ఆమెకు పెళ్లైంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నాడు. అయితే భర్తతో జరిగిన గొడవల కారణంగా ఆమె అతడికి దూరంగా ఉంటోంది. ఈ క్రమంలోనే మరో వ్యక్తితో ఫేస్ బుక్ లో పరిచయడం ఏర్పడింది. మెసేజ్ లతో ఏర్పడిన వారి స్నేహం, ప్రేమగా మారింది. అయితే ఈ క్రమంలోనే అతడు ఆమెను తన వద్దకు రమ్మని పిలిచాడు. దీంతో ఆమె కుమారుడితో సహా అతడి దగ్గరకు వెళ్లిపోయింది. ఆమె తండ్రి ఫిర్యాదుతో పోలీసుల ఆమెను వెనక్కి తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే ఆమె ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
బాపట్ల జిల్లా నర్సయ్యపాలెం గ్రామానికి చెందిన భూషణానికి 52 ఏళ్లు. ఇతడికి పెళ్లై 20 ఏళ్ల కుమారుడు, 18 ఏళ్ల కుమార్తె ఉన్నారు. అయితే ఇతడు గతంలోనే భార్యను వదిలేశాడు. అలాగే దొర్నిపాడుకు చెందిన హసీనా(25)కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే భర్త మద్యానికి బానిస కావడంతో అతనికి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే భూషణం, హసీనాలకు ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పడింది. రెండేళ్లుగా ఫోన్ లో మాట్లాడుకోవడంతో పాటు సందేశాలు పంపించుకుంటున్నారు. ఇటీవల భూషణం.. హసీనాను తన వద్దకు వచ్చేయాలని పిలవడంతో ఈనెల ఒటకవ తేదీన ఏడేళ్ల కుమారుడితో కలిసి వెళ్లిపోయింది.
ఈ ఘటనపై హసీనా తండ్రి దూదేకులు బాషా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలించి బాపట్లలోని నర్సయ్య పాలెంలో ఉన్న ఇద్దరినీ అదుపులోకి తీసుకొని దొర్నిపాడుకు తీసుకువచ్చారు. ఎస్సై తిరుపాలు వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. నవంబర్ 3వ తేదీ రాత్రి హసీనాను తండ్రికి అప్పగించి ఇంటికి పంపించారు. భూషణాన్ని సైతం పోలీసులు వదిలేయడంతో అతడు తిరిగి వెళ్లిపోయాడు. శుక్రవారం తహసీల్దార్ సమక్షంలో హసీనాను బైండోవర్ చేసేందుకు పోలీసులు సిద్ధం అయ్యారు. అయితే ఉదయం ఆరు గంటల సమయంలో తన మేనమాన ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఆత్మహత్యకు గల కారణాలు ఏంటో ఇంకా తెలియరాలేదు. అయతే వీరిద్దరూ పిల్లలుండి, ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పడడం, అది కాస్తా ఒకరి ప్రాణం పోవడానికి కారణం కావడం బాధాకరం.
దొంగతనం చేసేందుకు వచ్చావనడంతో బాలిక ఆత్మహత్య
ఏలూరు పెదవేగి మండలం రాట్నాలకుంటలో సెప్టెంబర్ 25వ తేదీన ఆత్మహత్యాయత్నం చేసిన బాలిక చికిత్స పొందుతూ ఈ నెల 8వ తేదీన ప్రాణాలు కోల్పోయింది. అయితే బాలిక ఆత్మహత్య చేసుకోవడానికి కారణం పక్కింటి వారేనని.. దొంగతనం చేయడానికి వచ్చావంటూ వాళ్లు కొట్టడంతోనే మనస్తాపానికి గురై తన కూతురు ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తల్లి ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఏలూరు నగరానికి చెందిన 17 ఏళ్ల కర్ణాటి కోమలేశ్వరి నగరంలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చుదువుతోంది. కోమలేశ్వరి తండ్రి గతంలోనే చనిపోయాడు.తల్లి పద్మావతే కుటుంబాన్ని పోషిస్తోంది. అయితే గత నెల 25వ తేదీన కర్ణాటి కోమలేశ్వరి పక్కనే ఉన్న ఇంట్లోని కుక్క పిల్లలను చూసేందుకు వారి ఇంటికి వెళ్లింది. అయితే కోమలేశ్వరిని చూసిన ఆ ఇంటిలోని భార్య భర్తలు దొంగతనం చేసేందుకు వచ్చావా అంటూ కొట్టారని తల్లి ఫిర్యాదులో పేర్కొంది. అదే రోజు కోమలేశ్వరి.. పెదవేగి మండలం రాట్నాలకుంటలో ఉంటున్న నానమ్మ వెంకట రమణ ఇవద్దకు వెళ్లింది. అక్కడ ఎవరూ లేని సమయం చూసి పురుగుల మందు తాగింది. తర్వాత కోమలేశ్వరిని గమనించి హుటాహుటినా దగ్గరిలోని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. కోమలేశ్వరి పరిస్థితిని గమనించి వైద్యులు.. మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లాలని సూచించగా.. కుటుంబ సభ్యులు కోమలేశ్వరిని విజయవాడకు తరలించారు. అప్పటి నుండి కోమలేశ్వరి అక్కడే చికిత్స పొందుతోంది. అయితే పరిస్థితి విషమించడంతో కోమలేశ్వరి తుది శ్వాస విడిచింది.