ఆనందరావు శౌర్యని రమ్మని ఎంత అడిగినా రాననే చెప్తుంది. ఆ మాటకి ఇంద్రుడు కల్పించుకుని తను రాను అని చెప్తుంది కదండీ ఎందుకు బలవంతం చేస్తున్నారని అడుగుతాడు. ఆ మాట చెప్పడానికి నువ్వు ఎవరు తను నా మనవరాలు నచ్చజెప్పి తీసుకెళ్తాను, బలవంతంగా తీసుకుని వెళ్తాను నీకేంటి సంబంధం. చిన్న పిల్ల ఇంట్లో నుంచి బయటకి వస్తే నచ్చజెప్పి పంపించాలసింది పోయి మీతోనే ఉంచుకుంటారా? నాకు మీ మీద అనుమానంగా ఉంది మీరే తన మనసు మార్చి ఇక్కడ ఉండేలా చేస్తున్నారు. ఏం నా మనవరాలిని మీ దగ్గరే ఉంచుకోవాలని అనుకుంటున్నారా అని ఆనందరావు నిలదీస్తాడు. నా మనవరాలిని మా నుంచి దూరం చెయ్యలేరు అని అంటాడు. వాళ్ళకి ఆ ఉద్దేశాలు ఏవి లేవు, అమ్మానాన్నలని వెతకడానికి ఎంత సహాయం చేస్తున్నారో తెలుసా వాళ్ళని ఏమి అనకు అని శౌర్య చెప్తుంది. మా మనవరాలు మాతో వచ్చే వరకి మేము ఇక్కడే ఉంటాము కదిలేదే లేదు అని ఆనందరావు డబ్బులు తీసి ఖర్చులకి ఉంచుకోమని ఇంద్రుడికి ఇస్తాడు.


దీప శౌర్య గురించి ఆలోచిస్తుంటే మళ్ళీ మోనిత వస్తుంది. ఏంటి మళ్ళీ వచ్చావ్ ఇందాక వాగింది సరిపోలేదా అని దీప అంటుంది. నేను నీతో గొడవపడటానికి రాలేదు అని చెప్తుంది.


మోనిత: ఇక్కడ నీకు ఆటో వాళ్ళు ఎవరైనా తెలుసా


దీప: ఎందుకు ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్నావా


మోనిత: నీకు దణ్ణం పెడతాను దీప నిజం చెప్పు ఇది మా భార్యాభర్తల విషయం నీకు సంబంధం లేదు. అప్పుడు వారణాసి అనే దరిద్రుడు ఉండే వాడు కదా ఇప్పుడు కూడా ఉన్నాడా


Also Read: మాధవ్ దేవి తండ్రి కాదని తెలిసి షాకైన సత్య- ఆదిత్యతో తిరగొద్దని రుక్మిణికి చెప్పిన రామూర్తి


దీప ఇంద్రుడిని గుర్తు చేసుకుని ఎందుకు అని అడుగుతుంది. నాకు తెలిసిన ఆటో డ్రైవర్ గురించి ఎందుకు అడుగుతుంది. శౌర్య గురించి ఏమైనా తెలిసిందా వీళ్ళు ఇద్దరు  కలిసి ఏదైనా చేస్తున్నారా అని మనసులో అనుకుంటుంది. ఎవడో ఆటో డ్రైవర్ కోసం వచ్చి ఇలా మాట్లాడుతున్నావ్ అంటే ఎందుకు అడుగుతున్నావ్ అని అంటుంది. ఎందుకా నీ లెవల్ కి దగ్గట్టు ఏదో ఒక ఆటో వాడిని సెట్ చేద్దాం అని మోనిత అనేసరికి దీప తన చెంప పగలగొట్టి బయటకి వెళ్లిపొమ్మని తిడుతుంది.


అటు కార్తీక్ కూడా ఇంద్రుడు గురించే ఆలోచిస్తూ ఉంటాడు. మోనిత వచ్చి ఏమైంది ఏం ఆలోచిస్తున్నావ్ నా మీద ఉన్న ప్రేమ, నమ్మకం ఏమైపోయిందని అడుగుతుంది. ప్రేమ.. అని వెటకారంగా అడుగుతాడు. అప్పుడు కూడా ఇలానే ఉన్నావా అని అడుగుతాడు. ఎందుకు ఇంతగా మారిపోయావ్ నేను ఏం తప్పు చేశాను అని మోనిత అడుగుతుంటే దుర్గ వచ్చి పిలుస్తాడు. హైదరాబాద్ దమ్ బిర్యానీ అడిగావు కదా చాలా కష్టపడి మరి వెతికి తీసుకొచ్చాను అని కార్తీక్ ముందు ఇరికిస్తాడు. నాలో మార్పు ఎందుకు వచ్చిందని అడిగావు కదా ఇప్పుడు అర్థం అయ్యిందా చేయాల్సింది అంతా చేసి మళ్ళీ ఎందుకు అని అడుగుతున్నావా అని కార్తీక్ ఛీ కొట్టి వెళ్ళిపోతాడు.


Also Read: అనసూయని వెర్రిదాన్ని చేసి ఆస్తి కొట్టేసిన లాస్య- తులసికి ఘోర అవమానం


దీప, కార్తీక్ శౌర్య ఫోటో చూపిస్తూ అందరినీ అడుగుతూ ఉంటారు. రాత్రి దీప మోనిత తన దగ్గరకి వచ్చి ఇంద్రుడు గురించి అడిగిందని చెప్తుంది. మనం శౌర్య గురించి వెతుకుతున్నట్టు తెలిసి ఇంద్రుడు గురించి అడిగిందా ఏంటి అని దీప అనుమానపడుతుంది. ఆనందరావు పిల్లల్ని తీసుకుని బయటకి వెళ్లాడని చంద్రమ్మ ఇంద్రుడుకి చెప్తుంది. ఎందుకు పంపించావ జ్వాలమ్మ మన బిడ్డ వాళ్ళ మనవరాలు కాదు అని అరుస్తాడు. ఆనందరావు శౌర్యని బలవంతంగా కారులో తీసుకుని వెళ్తుంటే నేను రాను ఇక్కడే ఉంటాను అని ఏడుస్తుంది. అప్పుడే ఆ కారు దీప, కార్తీక్ పక్క నుంచి వెళ్తుంది. గొంతు విన్న దీప ఆ కారులో శౌర్య ఉందని చెప్పేసరికి కార్తీక్ పరుగులు తీస్తాడు.