దేవుడమ్మ ఆదిత్య దగ్గరకి వస్తుంది. నీలో వస్తున్న మార్పులు చూస్తుంటే అనుమానం వస్తుంది.. అది భయమా లేదా నిజమా అని నువ్వే చెప్పాలి. ఈ అమ్మని, సత్యని కాదని తిరుగుతున్నావ్ అంటే రుక్మిణి ఎక్కడో ఉందో నీకు తెలుసు. నిజం చెప్పు రుక్మిణిని కలిశావా, తన చుట్టూనే తిరుగుతున్నావా, ఒకవేళ నువ్వు రుక్మిణిని కలిస్తే మా దగ్గర దాచాలసిన అవసరం ఏంటి నిజం చెప్పు అని అడుగుతుంది. మీకేవరికీ కనిపించని రుక్మిణి నాకు ఎందుకు కనిపిస్తుందమ్మా నిజంగా నాకు తను కనిపించలేదని ఆదిత్య చెప్తాడు. ఇంతకముందు నువ్వు ఏం చెప్పినా నమ్మేదాన్ని కానీ ఇప్పుడు కాదు నువ్వు ఆ మాట చెప్తున్నా నాకు నీ మాట నమ్మాలని అనిపించడం లేదని అంటుంది. లేదమ్మా నేను నిజమే చెప్తున్నా అని ఆదిత్య చెప్పినా కూడా దేవుడమ్మ నమ్మదు. ఖచ్చితంగా రుక్మిణి ఇక్కడే ఎక్కడో ఉంది వాడు చెప్పే అబద్ధాలె చెప్తున్నాయి, వాడు చెప్పకపోతే ఏంటి నా కోడలు ఎక్కడ ఉందో వెతికి తీసుకొస్తాను అని దేవుడమ్మ మనసులో అనుకుంటుంది.


Also Read: అనసూయని వెర్రిదాన్ని చేసి ఆస్తి కొట్టేసిన లాస్య- తులసికి ఘోర అవమానం


రుక్మిణి ఆదిత్య గురించి ఆలోచిస్తూ ఉంటే దేవి వచ్చి సంతోషంగా తల్లిని పట్టుకుని ఏడుస్తుంది. దేవి సంతోషంగా ఉండటం చూసి రుక్మిణి ఆనందపడుతుంది. తనలో చాలా మార్పు వచ్చిందని మొహంలో వెలుగు కనిపిస్తుందని రుక్మిణి మనసులో అనుకుంటుంది. అప్పుడే మాధవ్ గిటార్ పట్టుకుని వాయిస్తూ కూర్చుంటాడు. ఇప్పటి వరకు నాయన ఎవరు అని అడిగినా కదా ఇక నేను అడగను నేనే తెలుసుకుంటాను, నాయన కనిపిస్తే నువ్వు, నేను, ముగ్గురం కలిసి ఉందాం నువ్వేమి పరేషన్ కాకు ఇంకేమీ అడగనులే అని చెప్తుంది. పొద్దున్నే దేవి ఆదిత్య వాళ్ళ ఇంటికి వస్తుంది. దేవుడమ్మ రుక్మిణి ఎక్కడ ఉందో ఏంటో విచారిస్తాను అని ఈశ్వరప్రసాద్, రాజమ్మతో చెప్తుంది.


దేవి రావడం చూసి దేవుడమ్మ చాలా సంతోషిస్తుంది. ఎవరికి చెప్పకుండా అలా ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటి తప్పు కదా అని దేవుడమ్మ అంటుంది. మా నాయన్ని వెతుక్కుంటూ వెళ్ళాను అని దేవి చెప్పేసరికి సత్య షాక్ అవుతుంది. మాధవ్ ఇంట్లోనే ఉన్నాడు కదా అని ఈశ్వరప్రసాద్ అంటాడు. ఆ నాయన మా నాయన కాదు అని దేవి చెప్పేసరికి అందరూ షాక్ అవుతారు. సత్య ఆదిత్య వైపు చూస్తుంది. ఆ నాయన చెప్పినాకే తెలిసింది ఆయన మా నాయన కాదని దేవి అంటుంది. ఇంకా మాట్లాడుతుంటే దేవుడమ్మని ఆపి మనవరాలు వస్తే తినడానికి ఏమి పెట్టకుండా ఏంటి నువ్వు అని అంటుంది. దీంతో దేవుడమ్మ వెళ్ళిపోతుంది.


Also Read: కార్తీక్ కి గతం గుర్తొచ్చిందని అనుమానించిన మోనిత- శౌర్య దగ్గరకి వచ్చిన ఆనందరావు, హిమ


రామూర్తి రుక్మిణితో మాట్లాడటానికి వస్తాడు. నీ సొంత విషయాల్లో గుర్తు చేసుకోకూడదు అనే విషయం నాకు గుర్తుంది నేను ఇలా మాట్లాడతాన్న అని ఏమి అనుకోవద్దు. ఇది కుటుంబ గౌరవానికి సంబంధించిన విషయం. ఆఫీసర్ బాబు గురించి నీ గురించి నాకు తెలుసు ఇద్దరు మంచి వాళ్ళే. కానీ దేవమ్మ కోసం వస్తున్నారు కదా మన కుటుంబంతో కలిసిపోయాము కదా అని మనం అస్తామానం కలిస్తే బాగోదు కదా రేపు నిన్ను నలుగురు తప్పుగా అంటే నేను వినలేను అని రామూర్తి రుక్మిణితో చెప్తాడు.