Mother And Son Deadbodies In A House In Hyderabad: సికింద్రాబాద్ (Secunderabad) లాలాపేటలో తీవ్ర విషాదం వెలుగుచూసింది. ఇంట్లోని గదిలో తల్లీకొడుకుల మృతదేహాలు శనివారం వెలుగుచూశాయి. దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి చూడగా తల్లీకొడుకులు విగతజీవులుగా కనిపించారు. అనారోగ్యంతో తల్లి లక్ష్మి మృతి చెందగా.. ఆమె మృతిని తట్టుకోలేక కుమారుడు అభినయ్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తమ చావుకు ఎవరూ కారణం కాదంటూ సూసైడ్ లెటర్ రాశాడు. వీరు గత ఎనిమిదేళ్లుగా అక్కడ నివాసం ఉంటున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం అలుముకుంది.
Hyderabad News: ఇంట్లో నుంచి దుర్వాసన - అనుమానంతో చూడగా షాక్, 2 రోజులుగా గదిలోనే తల్లీ కొడుకుల మృతదేహాలు
Ganesh Guptha
Updated at:
04 Jan 2025 06:19 PM (IST)
Crime News: సికింద్రాబాద్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో అనారోగ్యంతో తల్లి మృతి చెందగా అది చూసి తట్టుకోలేని కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత 2 రోజులుగా అదే గదిలో వారి మృతదేహాలు ఉన్నాయి.
గదిలోనే తల్లీకొడుకుల మృతదేహాలు