అదృష్టం బాగా లేకపోతే అరటి పండు తిన్నా పన్ను విరుగుద్ది అనే సామెత వినే ఉంటారు. అరటి పండు తింటే పన్ను విరుగుతుందో? లేదో 
తెలియదు కానీ.. ఓ చికెన్ ముక్క మాత్రం ఓ నిండు ప్రాణాన్ని తీసింది. చికెన్ ముక్కెంటీ? మనిషి ప్రాణాలు తీయడమేంటని అనుకుంటారా..? ఓ చికెన్ ముక్క వ్యక్తి పాలిట మృత్యుదేవత అయ్యింది. తాగిన మైకంలో పచ్చి చికెన్ ముక్కను తినడంతో అది గొంతులో ఇరుక్కుపోయి ఓ వ్యక్తి మృతి చెందాడు.


పోలీసులు, స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా శివంపేట మండలం నవపేట్ రాములు తండాకు చెందిన లకావత్ భీమ్లా నాయక్ అనే వ్యక్తి కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతని భార్య, నలుగురు పిల్లులు ఉన్నారు. హత్నూర మండలం కొత్తగూడ తండా భీమ్లా స్వగ్రామం కాగా.. తన భార్యా పిల్లలతో కలిసి నవపేట్ గ్రామ శివారులో నివాసం ఉంటున్నాడు. 


భార్య రాణి సమీపంలో గల పరిశ్రమలో పనిచేస్తుంది. భీమ్లా గ్రామంలో వ్యవసాయ కూలి పనులకు వెళ్తాడు. పనుల దొరకని క్రమంలో గుమ్మడిదల అడ్డపైన పనికి వెళుతుంటాడు. భీమ్లా గురువారం పనికి వెళ్లి వచ్చే సమయంలో ఇంటికి చికెన్ తెచ్చుకున్నాడు. మద్యం మత్తులో ఉన్న భీమ్లా నాయక్ సుమారు రాత్రి 7 గంటల సమయంలో తన ఇంట్లోనే పచ్చి చికెన్ తిన్నాడు. చికెన్ గొంతులో ఇరుక్కుపోవడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు.


భీమ్లా నాయక్  గురువారం పనికి వెళ్లి వచ్చే సమయంలో ఇంటికి చికెన్ తెచ్చుకున్నాడు. మద్యం మత్తులో ఉన్న భీమ్లా నాయక్ సుమారు రాత్రి 7 గంటల సమయంలో తన ఇంట్లోనే పచ్చి చికెన్ తిన్నాడు. చికెన్ గొంతులో ఇరుక్కుపోవడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గమనించిన భార్య తీవ్ర ఆందోళన చెందింది. భర్తను బతికించుకునే ప్రయత్నం చేసింది. 


గమనించిన భార్య తీవ్ర ఆందోళన చెందింది. గొంతులో చేయి పెట్టి చికెన్‌ ముక్కను బయటకు తీసే ప్రయత్నం చేసింది. కొంచెం బయటికి తీయగా.. మిగిలిన చికెన్ గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించే మార్గమధ్యంలోనే భీమ్లా మృతి చెందాడు. నర్సాపూర్ ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి నేడు అంత్యక్రియలు నిర్వహించారు.


ఇలాంటి ఘటనలు ఎన్నో 


గతంలో  ఓ వ్యక్తి చికెన్ ముక్క గొంతులో ఇరుక్కుని చనిపోయాడు. బాలానగర్‌ మండలంలోని ఉడిత్యాల గ్రామానికి చెందిన పోచయ్య గౌడ్‌ (42)అనే వ్యక్తి చికెన్‌ తింటుండగా ప్రమాదవశాత్తు ఓ చికెన్ ముక్క ఆయన గొంతులో ఇరుక్కుపోయింది. కుటుంబ సభ్యులు వెంటనే పోచయ్యను ఆసుపత్రికి తీసుకెళ్లిన ఫలితం లేకుండా పోయింది. ఊపిరాడక గిలగిలా కొట్టుకున్న పోచయ్య గౌడ్‌  అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశాడు.


అసలు పచ్చి చికెన్ తినడం ఏంటి..? తాగిన మైకం ఏమైనా చేస్తుంది. మత్తులో చేసిన పని ప్రాణాలకే ఎసరు పెట్టింది. ఉడికి ఉడకని చికెన్ తింటేనే.. ఎన్నో అనర్థాలు ఉన్నారు. రకరకాల ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ఉడికిన మాంసం తినే సమయంలో కూడా జాగ్రత్త అవసరం. ఆదరా బాదరాగా తింటే ముక్క గొంతులో ఇరుక్కుపోయి ప్రాణాలకే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. బీ కేర్‌ఫుల్.