మహారాష్ట్రలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వార్థా జిల్లాలోని ఓ వంతెన పై నుంచి కారు పడిన ప్రమాదంలో ఏడుగురు వైద్య విద్యార్థులు మృతి చెందారు. యావత్‌మాల్‌ నుంచి వార్థాకు విద్యార్థులు వెళ్తుండగా సోమవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. స్పీడ్ గా వచ్చిన కారు అదుపు తప్పి వంతెన పై నుంచి కిందకు పడినట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. సెల్సూరా ప్రాంతంలో సోమవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో జరిగినట్లు తెలుస్తోంది.  ఈ ప్రమాదంలో చనిపోయినవారంతా సావంగిలోని మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ చదువుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ ఎమ్మెల్యే విజయ్‌ రహ్నాగ్డేల్ కుమారుడు ఆవిష్కర్ రహ్నాగ్డేలే ఈ కారు ప్రమాదంలో మృతి చెందారు. ఈ ఘటన జరిగిన వెంటనే కారులోని వారిని కాపాడాలని స్థానికులు ప్రయత్నించారు. కానీ అప్పటికే విద్యార్థులందరూ మృతి చెందినట్లు వెల్లడించారు. 






Also Read: ఏపీలో మరో 13 కొత్త జిల్లాలు... ఉగాదిలోపు అమల్లోకి వచ్చే అవకాశం... నేడో, రేపో నోటిఫికేషన్ విడుదల..!


అడవి జంతువు అడ్డురావడంతో


సెల్సురా నుంచి కారు వెళుతుండగా అకస్మాత్తుగా ఒక అడవి జంతువు అడ్డురావడంతో అదుపుతప్పిన కారు వంతెన పై నుంచి కిందకు పడిపోయి ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రాథమిక విచారణ ప్రకారం కారును నడుపుతున్న వ్యక్తి, జంతువును తప్పించుకోవడానికి బలంగా పక్కకు తిప్పడంతో వాహనం వంతెన పై నుంచి పడిపోయింది. దీంతో విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందినట్లు వార్ధా ఎస్పీ ప్రశాంత్ హోల్కర్ తెలిపారు. మృతుల్లో తిరోరా నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే విజయ్ రహ్నాగ్డేల్ కుమారుడు ఆవిష్కర్ కూడా ఉన్నారు. ఇతర బాధితులను నీరజ్ చౌహాన్, నితేష్ సింగ్, వివేక్ నందన్, ప్రత్యూష్ సింగ్, శుభమ్ జైస్వాల్, పవన్ శక్తిగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 


Also Read: నేడే మహిళల ఖాతాల్లో నగదు జమ... ఈబీసీ నేస్తం పథకాన్ని ప్రారంభించనున్న సీఎం జగన్