Goats Theft : జల్సాలకు అలవాటు పడి తరచుగా నేరాలకు పాల్పడితే పీడీ చట్టం ప్రయోగిస్తామని కరీంనగర్ రూరల్ ఏసీపీ కరుణాకర్ రావు హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ కరుణాకర్ రావు మాట్లాడుతూ గొర్రెలు, మేకల దొంగలను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. 9 మంది నిందితులను మీడియా ముందు హాజరపరిచారు. ఏసీపీ మాట్లాడుతూ కరీంనగర్, సిద్దిపేట, వరంగల్ జిల్లాల్లోని వివిధ మండలాల్లో ఈ తొమ్మిది మంది నిందితులు గొర్రెలు, మేకల దొంగతనానికి పాల్పడినట్లు వెల్లడించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మహ్మదాపూర్ గ్రామానికి చెందిన శివరాత్రి.సంపత్, కోనేటి.కిరణ్, సూర.రాజు, పందిపల్లి.ప్రశాంత్, శివరాత్రి.రంజిత్, శివరాత్రి.అనిల్, సుర.సంపత్, దున్నపోతుల.వెంకటేష్, శివరాత్రి.అనిల్ అలియాస్ గిరి విలాసాలకు అలవాటు పడి దొంగతాలను చేస్తున్నారు. సులువుగా తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో గత కొన్ని నెలలుగా మానకొండూరు, ఎల్కతుర్తి, కోహెడ, చిగురుమామిడి, అక్కన్నపేట, కోహెడ, మద్దూరు తదితర ప్రాంతాలలో పథకం ప్రకారం రెక్కీ నిర్వహించి రాత్రి సమయంలో గొర్రెలు, మేకలను చోరీ చేశారు.
కారుల్లో వచ్చి చోరీ
దొంగిలించిన గొర్రెలు, మేకలను సంతలలో గుర్తుతెలియని వ్యక్తులకు అమ్మి వచ్చిన డబ్బులను వాటాలుగా పంచుకునేవారని, గొర్రెలను దొంగతనం చేసేందుకు నిందితులు కార్లను ఉపయోగించేవారని ఏసీపీ వెల్లడించారు. అదేవిధంగా గతవారం రోజులలో కొహెడ మండలం గోట్లమిట్ట, మద్దూర్ లో దొంగతనం చేసిన 11 మేకలను కార్లలో వేసుకొని ఎవరికి అనుమానం రాకుండా సంతలలో అమ్ముటానికి కరీంనగర్ వైపు వెళుతుండగా చిగురుమామిడి బస్టాండ్ సమీపంలో ఎస్సై దాస సుధాకర్ పట్టుకున్నారన్నారు. నిందితుల నుంచి రూ.1,07,000 నగదు, 11 మేకలు, మూడు కార్లను స్వాధీనం చేసుకున్నాని ఏసీపీ తెలిపారు. నిందితులను రిమాండ్ కు తరలించినట్లు వెల్లడించారు. దొంగలను చాకచక్యంగా పట్టుకున్న చిగురుమామిడి ఎస్సై సుధాకర్, పోలీస్ సిబ్బందిని ఏసీపీ అభినందించి, నగదు ప్రోత్సాహం అందించారు.
రిక్షాబండి చోరీ
గుంటూరు జిల్లా మంగళగిరిలో అన్నపూర్ణ థియేటర్ సమీపాన గల గజలక్ష్మి ట్రేడర్స్ అనే సిమెంట్ దుకాణం ఉంది. ఆ దుకాణ యజమాని తమ వద్ద సరుకు కొన్న వారికి డెలివరీ చేయాడనికి ఓ బల్ల రిక్షాబండిని కూడా కొన్నారు. దాన్ని ఆయన రోజూ దుకాణం మూసి వేళ్లే ముందు తాళం వేసి దుకాణం ముందే ఉంచి వెళ్తారు. ఇలా వెళ్లిన ఆయనకు తర్వాత రోజు ఉదయం వచ్చి చూస్తే కనిపించ లేదు. అయితే ఎటు పోయిందో తెలుసుకోవడానికి ఆయనకు పది నిమిషాలే ప ట్టింది. ఎందుకంటే ఆయన దుకాణం ముందు సీసీకెమెరాలు పెట్టి ఉన్నాడు.
సీసీ కెమెరాల్లో రికార్డు
దుకాణంలోకి వెళ్లి సీసీ కెమెరా రికార్డింగ్‌ను రివైండ్ చేసుకుని చూస్తే ఆటోలో వచ్చిన ఇద్దరు వ్యక్తులు దర్జాగా రిక్షాను తీసుకెళ్లిపోవడం కనిపించింది. రిక్షాను ఎవరు దొంగతనం చేస్తారులే అనుకున్న ఆ దుకాణ యజమానికి దొంగలు ఇచ్చిన షాక్‌తో మైండ్ బ్లాంక్ అయింది. సీసీ టీవీ ఫుటే్జీతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ ఆటో లో వచ్చిన దుండగుడు సదరు రిక్షా బండిని ఆటోకు కట్టుకొని పరారయ్యాడు. అయితే ఈ మాత్రం రిక్షాను దొంగతనం చేయడానికి అంతర్రాష్ట్ర దొంగలెవరోరారని లోకల్ దొంగల పనేనని పోలీసులకు అర్థమైపోయిదంి. సీసీటీవీ ఫుటేజీలో ఉన్న వారి మొహాలు కనిపించకపోయినా వారి బాడీ లాంగ్వేజ్‌తోనే దొంగలెవరో ఇట్టే పట్టేసుగోలరు. అయితే పోలీసులు ఈ కేసును ఎంత సీరియస్‌గా తీసుకుంటే అంత త్వరగా పట్టుకుంటారు. లేకపోతే ఈ దొంగలు ఇంత దరిత్రులేమిటి అని లైట్ తీసుకుంటారేమోచూడాలి .