Hyderabad woman duped of Rs 5.6 crore in Shilpa Shettys name :  ఆన్‌లైన్‌లో వందలు, వేలు, లక్షలు ఫ్రాడ్ చేయడం కన్నా.. ఒక్క సారే కోట్లు చేస్తే బెటరని ఫ్రాడ్‌స్టర్లు అనుకుంటున్నారు. ఫలితంగా బ్యాంకు అకౌంట్లలో బాగా డబ్బులున్న వారిని లేకపోతే కాస్త సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న కుటుంబాల్లో పెద్ద వారిని టార్గెట్ చేసుకుంటున్నారు. ఫోన్ల ద్వారానే మొత్తం ఊడ్చేస్తున్నారు. ఇలాంటి ఘటన హైదరాబాద్‌లో తాజాగా జరిగింది. ఈ ఘటనలో బాధితురాలు ఏకంగా ఐదు కోట్ల అరవై లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు.  


వాట్సాప్‌ కాల్‌తో ప్రారంభం


హైదరాబాద్‌ అడిక్ మెట్‌లోని విద్యానగర్ ప్రాంతంలో నివసించే వృద్ధురాలైన ఓ మహిళకు కొద్ది రోజుల కిందట వాట్సాప్ కాల్ వచ్చింది. తెలియని నెంబర్ నుంచి వచ్చిన నెంబర్ నుంచి వచ్చిన ఆ కాల్ ను రిసీవ్ చేసుకోవడమే ఆ పాలిట శాపం అయింది. ఫోన్ చేసిన వారు తాము ముంబై పోలీసులమని.. శిల్పాషెట్టి, రాజ్ కుంద్రాలకు సంబంధించిన ఓ కేసులో మీ పేరు బయటకు వచ్చిందని చెప్పారు. ఆధార్ కార్డు నెంబర్ చెప్పడంతో  ఆ మహిళ భయపడిపోయింది. ఆమెకు చెందిన  బ్యాంక్ అకౌంట్‌లో అనుమానాస్ప లావాదేవీలు  జరిగాయని.. సహకరించకపోతే కుటుంబం అంతటిని అరెస్టు చేస్తామని  బెదిరించారు. 


కవిత, కనిమొళిల జైలు జీవితం ఒకేలా ఉందా ? ఈ సారూప్యతలు గమనించారా ?


డిజిటల్ అరెస్టు పేరుతో భయపెట్టిన మోసగాళ్లు


ఫోన్ చేసిన వాళ్లు ఒక్క సారే ఫోన్ చేసి ఈ మోసం చేయడం లేదు. విడతల వారీగా ఆ మహిళ దగ్గర ఎంత నగదు ఉందో.. అంత పిండుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. డిజిటల్ అరెస్టు చేసేశామని.. తమ పోలీసులు రెడీగా ఉంటారని.. కానీ కేసు నుంచి బయట పడటానికి ఓ చాన్స్ ఇస్తామని చెప్పి.. ఆ సొమ్మంతా తిరిగి ఇవ్వాలని బెదిరించారు. ఇలా మొత్తంగా ఆమె వద్ద ఉన్న సొమ్ము.. పీఎఫ్ అమౌంట్ కూడా డ్రా చేసేసి మొత్తం వారికి అప్పచెప్పారు. అలా ఐదు కోట్ల అరవై లక్షల రూపాయలు వారు చెప్పినఖాతాలకు ట్రాన్స్ ఫర్ చేశారు. 


కేంద్రమంత్రికే ఝలక్ ఇచ్చిన ట్రాఫిక్ పోలీస్‌లు, కార్ ఓవర్‌ స్పీడ్‌పై చలానా


మహిళ కుటుంబ సభ్యులకు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు


తమ తల్లి ఇలా లక్షలకు లక్షలు ఏమి చేస్తుందో తెలియక ఓ సారి ఆమె పిల్లలు గట్టిగానే అడిగారు. అప్పుడు కానీ ఆమె అసలు నిజం చెప్పలేదు. అప్పుడు కూడా నిజం చెబితే మిమ్మల్ని కూడా అరెస్టు చేస్తారని వణికిపోయింది. కానీ ఈ ఆన్ లైన్ మోసం గురించి క్లారిటీ ఉండటంతో పోలీసుల్ని ఆశ్రయించారు. ఇప్పుడు ఆ సొమ్ము రికవరీ కోసం ప్రయత్నిస్తున్నారు. 


ఆన్ లైన్‌లో వచ్చే ఫెడ్క్స్.. ఈడీ పేరుతో  కాల్స్ మొత్తం ఫ్రాడేనని పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి కాల్స్ లో మోసపోతే వెంటనే 1930 నెంబర్‌కు కాల్ చేయాలని సూచిస్తున్నారు. లేకపోతే 8712672222 నెంబర్‌కు.. WWW.Cybercrime.gov.in అయినా ఫిర్యాదు చేయవచ్చు. ఆన్ లైన్ మోసాల పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.