Kondapur Crime : హైదరాబాద్ కొండాపూర్‌లోని శ్రీరామ్‌నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. తన భర్తతో యువతి సన్నిహితంగా ఉంటోందని భావించిన గాయత్రి అనే మహిళ నలుగురు యువకులతో యువతిపై అత్యాచారయత్నం చేయింది. యువతిని ఇంటికి పిలిచి బంధించి యువకులతో అత్యాచారయత్నం చేసినట్లు తెలుస్తోంది. తనను చిత్రహింసలకు యువకులు, గాయత్రి చిత్రహింసలకు గురించినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనను వీడియో తీసి గాయత్రి బ్లాక్‌మెయిల్‌ చేసినట్లు బాధిత యువతి పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురు యువకులతో పాటు గాయత్రిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 


అసలేం జరిగింది? 


హైదరాబాద్ లోని కొండాపూర్ గాయత్రి అనే మహిళ ఓ యువతిని పథకం ప్రకారం కిడ్నాప్ చేసి నలుగురు యువకులతో అత్యాచారయత్నం చేయించింది. యువతిపై నలుగురు యువకులు లైంగిక దాడికి పాల్పడిన ఘటన సంచలనం అయింది. శ్రీకాంత్‌ కుటుంబం, బాధిత యువతి కొండాపూర్‌లోని ఓ కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరిద్దరూ సివిల్స్‌కు ప్రిపేర్‌ అవుతున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఇద్దరి స్నేహంపై అనుమానంతో గాయత్రి ఆ యువతిని కొండాపూర్‌లోని ఇంటికి పిలిచింది. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు బాధితురాలిని గాయత్రి తన ఇంట్లోనే పెట్టుకుంది. ఈ క్రమంలో భర్త శ్రీకాంత్‌, యువతి స్నేహంపై గాయత్రి అనుమానం పెంచుకుంది. ఈ విషయంపై ఏప్రిల్‌ 24న గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ లో ఆమె ఫిర్యాదు కూడా చేసింది. 



(నిందితురాలు గాయత్రి)


ఇంట్లో బంధించి చిత్రహింసలు


ఈ కేసును విత్‌డ్రాపై మాట్లాడాలని బాధితురాలిని ఇంటికి పిలిచింది. పథకం ప్రకారం యువతిని గదిలో బంధించి కిరాయికి మాట్లాడుకున్న నలుగురు యువకులతో దాడి చేయించింది. యువతి నోట్లో గుడ్డలు కుక్కిన యువకులు ఆమెను తీవ్రంగా హింసించారు. ఆ తర్వాత యువతిపై నలుగురు యువకులు లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ దారుణాన్ని గాయత్రి సెల్‌ఫోన్‌లో చిత్రీకరించింది. ఈ ఘటనపై ఎవరికైనా చెబితే వీడియోను సోషల్‌ మీడియాలో పెడతానని బెదిరించింది. తీవ్రంగా గాయపడిన యువతిని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించిన కుటుంబ సభ్యులు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు గాయత్రితో పాటు, నలుగురు యువకులను అరెస్టు చేశారు. 


Also Read : Family Kidnap : అప్పు తీసుకున్నందుకు కుటుంబాన్నే కిడ్నాప్, గ్రామస్తుల ఎంట్రీతో సీన్ రివర్స్!


Also Read : Satyasai District Crime : సత్యసాయి జిల్లాలో దారుణం, అనుమానంతో భార్య, అత్తమామలపై అల్లుడు కత్తితో దాడి