Hyderabad Crime News: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో దారుణం జరిగింది. తెలంగాణ హైకోర్టు సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి ఓ యువకుడిని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. జనం అంతా చూస్తుండగానే ఇష్టం వచ్చినట్లుగా నరికి అక్కడి నుంచి పారిపోయాడు. అయితే 10 వేల రూపాయల వ్యవహారంలో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. వ్యక్తి హత్యను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. హుటాహుటిన రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు సేకరించిన పోలీసుల, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వ్యక్తిని స్థానికంగా ఉన్న సులభ్ కాంప్లెక్స్ లో పని చేస్తున్న మిథున్ గా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad Crime News: తెలంగాణ హైకోర్టు ఎదుట దారుణం - వ్యక్తిని కత్తితో పొడిచి చంపిన దుండగుడు
ABP Desam | Edited By: jyothi Updated at: 04 May 2023 01:01 PM (IST)
Hyderabad Crime News: హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. తెలంగాణ హైకోర్టు ఎదుట ఓ వ్యక్తిని అంతా చూస్తుండగానే గుర్తు తెలియని వ్యక్తి కత్తితో పొడిచి హత్య చేశాడు.
తెలంగాణ హైకోర్టు ఎదుట దారుణం - వ్యక్తిని కత్తితో పొడిచి చంపిన దుండగుడు