హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో శనివారం సాయంత్రం భారీ చోరీ జరిగింది. నగరానికి చెందిన స్థిరాస్తి వ్యాపారి సంతోష్‌రెడ్డి..మరో స్థిరాస్తి వ్యాపారికి ఇవ్వమని చెప్పి డ్రైవర్ శ్రీనివాస్‌కు రూ.55 లక్షలు ఇచ్చారు. కానీ శ్రీనివాస్ ఆ డబ్బు వ్యాపారికి ఇవ్వకుండా రూ.55 లక్షలు, కారుతో సహా ఉడాయించాడు. సంతోష్ ఫోన్ చేయగా శ్రీనివాస్ ఫోన్ స్విచాఫ్ అని వస్తోంది. దీంతో బాధితుడు జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు శ్రీనివాస్ కోసం గాలిస్తున్నారు.
Also Read: 15 ఏళ్ల బాలికపై 29 మంది అత్యాచారం.. మహారాష్ట్రలో దారుణం..
చోరీ కేసును ఛేదించిన పోలీసులు
హైదరాబాద్ గచ్చిబౌలి టెలికాం నగర్లో ఉండే గోవిందరావు అనే వ్యక్తి ఇంట్లో కొన్ని నెలల కిందట ఓ వ్యక్తి పనిలో చేరాడు. కొంత కాలం బాగానే పనిచేశాడు. తర్వాత ఊరికి వెళ్తున్నానని చెప్పి, తాను తిరిగి వచ్చే వరకు తన బంధువులను పనిలో పెడుతున్నారని యజమానికి నమ్మబలికాడు. గోవిందరావు ఓకే చెప్పడంతో అనడంతో అతని బంధువులు లక్ష్మణ్, పవిత్ర దంపతులు నాలుగు నెలలుగా గోవిందరావు ఇంట్లో పనిచేస్తున్నారు. ఊరెళ్లిన వ్యక్తి రాకపోవడంతో వీరినే కొనసాగించారు గోవిందరావు.
Also Read: ఢిల్లీ రోహిణీ కోర్టులో కాల్పులు.. లాయర్ల వేషధారణలో వచ్చి ఘాతుకం, ముగ్గురు మృతి
నమ్మి పనిస్తే.. చోరీ చేశారు
ఇటీవల గోవిందరావు కుటుంబ సభ్యులతో శ్రీశైలం దర్శనానికి వెళ్లారు. ఇదే అవకాశంగా భావించిన నేపాల్ దంపతులు ఇంటి కిటీకీ తొలగించి లోపలికి ప్రవేశించారు. బెడ్ రూమ్ తలుపు తొలగించి లాకర్లో ఉన్న రూ. 10 లక్షలు సొమ్ము, 110 తులాల బంగారంతో పరారయ్యారు. శ్రీశైలంలో ఉన్న గోవిందరావు లక్ష్మణ్‌కు ఫోన్ చేయడంతో అతని ఫోన్ స్విచాఫ్ వచ్చింది.దీంతో అనుమానం వ్యక్తం చేసిన యజమాని వెంటనే ఇంటికి వచ్చారు. ఇంట్లో నగదు, బంగారం లేకపోవడం, వాచ్ మెన్ కూడా కనిపించకపోవడంతో దొంగతనం జరిగిందని పోలీసులు ఫిర్యాదు చేశారు. నమ్మకంగా ఇంట్లో పనిచేసిన వ్యక్తులు ఇలా చోరీకి పాల్పడతారని అనుకోలేదని యజమాని ఆవేదన చెందుతున్నారు.
Also Read: లిక్కర్ తాగించాడు.. చీరతో ఉరేసి చంపాడు.. ఇన్నాళ్లకు చిక్కాడు
చోరీ చేసి నేపాల్ కు పరారీ
ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు దొంగలను పక్కా ప్రణాళికతో పట్టుకున్నారు. వీరింతా తరచుగా హైదరాబాద్‌లో దోపిడీ చేస్తున్నారని పోలీసుల దర్యాప్తులో తెలిసింది. ఇళ్లల్లో పనిచేస్తామంటూ ఎవరైనా వస్తే యజమానులు పూర్తిగా విచారించి పనిలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. చోరీ చేసిన తర్వాత ముఠా సభ్యులంతా సమంగా పంచుకుంటారు. బంగారు ఆభరణాలను ముక్కలుగా చేసుకుని పంచుకుంటారు. ఎవరి దారిన వాళ్లు నేపాల్‌కు తిరిగి వెళ్తుంటారు. దొంగిలించిన సొత్తును చాలా తక్కువ ధరకే విక్రయిస్తారు. వీరికి రెండు ఇళ్లు ఉంటాయి. ఒకటి ఊరిలో, మరొకటి ఊరి చివర గుట్టలపై ఉంటుంది. పోలీసులు వస్తున్నట్లు సమాచారం రాగానే గుట్టలపై ఉన్న ఇళ్లకు వెళ్లిపోతుంటారు. అక్కడికి వెళ్లాలంటే 5 గంటల నుంచి 7 గంటల సమయం పడుతుంది. పోలీసుల రాకపోకలను ఎప్పటికప్పుడు గమనిస్తూ పారిపోతూ ఉంటారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్ చేయండి