మహారాష్ట్రలో మృగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. 15 ఏళ్ల బాలికపై గత కొన్ని నెలలుగా 29 మంది అత్యాచారానికి పాల్పడ్డారు. ఇటీవల ముంబైలో నిర్భయ తరహా ఘటనను మరవకముందే.. ఈ దారుణం చోటుచేసుకోవడంతో రాష్ట్రం ఉలిక్కిపడింది. ఈ దారుణ ఘటన ఠాణే జిల్లా డోంబివలీలో జరిగింది. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాలికపై అత్యాచారానికి పాల్పడిన వారిలో ఇద్దరు మైనర్‌ బాలురు కూడా ఉన్నారు. మొత్తం 29 మంది బాలురు బాధిత బాలికను బెదిరించి గత కొద్ది నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం చేయడమే కాకుండా దానిని వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌ చేశారు. ఘటనకు కారణమైన వారిలో 23 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు. 


Also Read: Crime News: నీకు స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వాలి.. తెలివి పెంచుతానంటూ.. బాలికను గర్భవతి చేసిన మాస్టారు


మిత్రుడే ప్రధాన నిందితుడు..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలి మిత్రుడు ఈ ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఇతను ఈ ఏడాది జనవరిలో బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీనిని వీడియో తీసి.. మరో వ్యక్తికి చూపించాడు. వీడియో చూసిన వ్యక్తి బాలికను బ్లాక్‌మెయిల్‌ చేయడం మొదలుపెట్టాడు. తనకు సహకరించకపోతే వీడియో బయటపెడతానని బెదిరించి.. ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇలా మొత్తం 29 మంది తనపై అత్యాచారానికి పాల్పడినట్లు బాధిత బాలిక పోలీసులకు తెలిపింది. దీంతో నిందితులపై సామూహిక అత్యాచారం, పోక్సో చట్టం పోలీసులు కేసులు నమోదు చేశారు. 


Also Read: Hyderabad Boy Kiss: 8 ఏళ్ల బాలికకి గట్టిగా ముద్దు పెట్టేసిన బాలుడు.. కారణం తెలిసి పోలీసుల దిమ్మతిరిగింది!


23 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఫిర్యాదు అందిన వెంటనే తాము ప్రత్యేక డ్రైవ్ నిర్వహించామని పోలీసులు వెల్లడించారు. ఇప్పటివరకు ఇద్దరు మైనర్లు సహా 23 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితులంతా బాధితురాలికి, ప్రధాన నిందితుడికి సన్నిహితులేనని పేర్కొన్నారు. వీరంతా ఆమెను బ్లాక్‌మెయిల్‌ చేస్తూ.. లైంగిక దాడికి పాల్పడినట్లు చెప్పారు. బాధితురాలు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని వెల్లడించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పారు. 


Also Read: Nalgonda: మహిళ నోరు నొక్కి ఇంట్లోకి లాక్కెళ్లి ఇద్దరు వ్యక్తులు రేప్.. తల బండకేసి బాది ఘాతుకం


Also Read: Crime News: తాను పురుగుల మందు తాగి.. ఆరేళ్ల కుమార్తెకు ఉరేసిన తండ్రి..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి.