ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ ప్రత్యర్థులపై వైఎస్ఆర్‌సీపీ నేతలు విచ్చలవిడి దాడులకు పాల్పడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఏపీ డీజీపీకి లేఖ రాసిన సమయంలోనే పల్నాడు జిల్లా దాచేపల్లిలో మరో ఘటన చోటు చేసుకుంది. దాచేపల్లి పట్టణంలో తెలుగుదేశం పార్టీకి చెందిన కానిశెట్టి నాగులు అనే వ్యక్తి కుటుంబంపై దాచేపల్లి - నడికుడి నగర పంచాయతీ చైర్మన్ మునగ రమాదేవి కుటుంటబసభ్యులు దాడికి దిగారు. మునగ రమాదేవి భర్త, కొడుకులు, బంధువులు అందరూ కలిసి పది మందికిపైగా ఇంటిపై దాడికి దిగినట్లుగా సీసీ కెమెరా దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. 


జంగిల్‌ రాజ్‌లో ప్రజలకు రక్షణ కరవు - లా అండ్ ఆర్డర్‌పై దృష్టి పెట్టాలని డీజీపీకి చంద్రబాబు లేఖ


కానిశెట్టి నాగులు అనే వ్యక్తి కుటుంబానికి మునగ రమాదేవి కుటుంబానికి కొన్నాళ్లుగా రాజకీయ పరమైన వివాదాలున్నాయి. ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో రమాదేవి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేశారు. కౌన్సిలర్‌గా పోటీ చేసిన సమయంలో టీడీపీలో ఉన్న నాగులు కుటుంబ సభ్యులు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఆ కోపం మనసులో ఉంచుకున్నారు. ఇటీవలి కాలంలో రెండు కుటుంబాల మధ్య వివాదాలు పెరిగిపోవడంతో హఠాత్తుగా దాడిగి దిగారు.   గత మున్సిపల్ ఎన్నికల్లో వాళ్లకు ఓటు వేయలేదని కక్ష కట్టి చిన్న చిన్న కారణాలతో మా మీద దాడి చేశారని నాగులు కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది.


జిల్లాలు పెరిగాయి, 12 మెడిక‌ల్ కాలేజీలు ఇవ్వండి - కేంద్రాన్ని కోరిన ఏపీ సీఎం జ‌గ‌న్


పాత గొడవలకు తోడు..  నిన్న సాయంత్రం ఓ వాటర్ క్యాన్ రోడ్డుకు అడ్డంకు ఉందన్న కారణంతో నాగులు కుటుంబంతో మున్సిపల్ చైర్మన్ కుటుంబం వాదనకు దిగింది. ఆ తర్వాత  ఇంటి మీదకి కర్రలతో మారణాయుధాలతో దాడికి వచ్చారు.  ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం ప్రాణభయంతో ఇంట్లో కెళ్ళి తాళాలు వేసుకుని దాక్కున్నారు.   చివరికి ఇంటి పక్కనే ఉన్నా పశువులను కూడా వదలకుండా గాయపరిచారు  చైర్మన్ భర్త, కొడుకు, బంధువులు. విషయం తెలిసి పోలీసులు అక్కడకు వచ్చి నచ్చజెప్పడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు చైర్మన్ వర్గీయులు.


అత్తింటి ముందు మహిళ న్యాయపోరాటం, హైదరాబాద్ లో 8 నెలల కాపురం చేసి వదిలేసి వచ్చేసిన భర్త!


మున్సిపల్ చైర్మన్ కుటుంబసభ్యులు దాడులు చేసినా వారిపై పోలీసులు చర్యలు తీసుకోకుండా నచ్చ చెప్పి పంపడం ఏమిటన్న విమర్శలను టీడీపీ నేతలు చేస్తున్నారు. తక్షణం మున్సిపల్ చైర్మన్ భర్త, కుమారులపై కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.