Srikakulam News : శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ రోటరీ నగర్ కాలనీలో భర్త ఇంటి ముందు న్యాయ పోరాటానికి దిగింది ఓ యువతి. పట్టణానికి చెందిన భాను నాయక్ తో గత ఏడాది జనవరి 5వ తేదీన సనపల మురళీ కృష్ణతో స్థానిక కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లలో డీఎస్పీ శివరామి రెడ్డి ఆధ్వర్యంలో వివాహం జరిగింది. అయితే తన వద్ద ఉన్న సొమ్ము కాజేసి శారీరకంగా, మానసికంగా ఇబ్బందులకు గురిచేసి నడిరోడ్డుపై వదిలి ఇంటికి తాళం వేశారని వాపోయింది. మరిది సనపల హరిక్రిష్ణ వజ్రపుకొత్తూరు మండలం డోకులపాడు సచివాలయంలో అసిస్టెంట్ ఇంజినీరింగ్ గా విధులు నిర్వహిస్తున్నారు. అతను తనతో అసభ్యకరంగా ప్రవర్తించేవాడని ఆమె ఆరోపించింది.
"నా భర్త ఎన్ని చిత్రహింసలకు పెట్టినా ఎప్పటికైనా మారతాడని అలానే ఓపిక పట్టాను. హైదరాబాద్ లో రెంట్ కు ఉన్న ఇంట్లో నన్ను వదిలి పెట్టి పారిపోయాడు. 15 రోజులు అక్కడున్నాడో తెలియలేదు. పెళ్లి అయిన తర్వాత రోటరీ కాలనీకి వస్తే అత్తమామ, మరిదిని వేరే చోటికి పంపేశాడు. ఆ తర్వాత డీఎస్పీతో మాట్లాడి హైదరాబాద్ తీసుకెళ్లాడు. అక్కడ కొన్ని నెలలు ఉండి ఇప్పుడు పారిపోయివచ్చేశాడు. నాకు న్యాయం చేయండి. నా మరిది కూడా నన్ను మాటలతో హింసించేవాడు. " అని బాధితురాలు భాను నాయక్ ఆరోపించారు.
అసలేం జరిగింది
మురళీ కృష్ణ , భాను నాయక్ పదేళ్ల క్రితం సహజీవనం చేశారు. ఇద్దరు జాబ్ చేసుకునే రోజుల్లో సహజీవనం చేసి ఆ తర్వాత దళిత మహిళ అని చెప్పి వదలి వచ్చేశాడు మురళీ కృష్ణ. మన పెళ్లి ఇంట్లో ఒప్పుకోరని చెప్పి మురళీ కృష్ణ చెప్పి వచ్చేశాడు. అప్పుడు భాను నాయక్ స్థానిక దళిత నేతలను ఆశ్రయించింది. వాళ్లు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. పలాస-కాశీ పోలీస్ స్టేషన్లో గత ఏడాది వీరికి పెళ్లి అయింది. ఆ తర్వాత హైదరాబాద్ లో ఎనిమిది నెలలు బాగానే ఉన్నారు. ఒకరోజు సడన్ ఆమె వదలేసి వచ్చేశాడు. దీంతో ఆమె చాలా చోట్ల వెతికి టెక్కలిలో భర్త ఉన్నాడని తెలుసుకున్నా అక్కడికి వెళ్లింది. టెక్కలి పోలీస్ స్టేషన్ లో పంచాయితీ జరిగి అత్తామామలను యువతిని తీసుకెళ్లాలని సూచించారు. ఎస్సై ముందు సరే అని చెప్పిన అత్తమామలు బయటకు వచ్చి ఎవరికీ తెలియకుండా వేరే చోటకు వెళ్లిపోయారు. ఇవాళ వాళ్లు రోటరీ నగర్ కాలనీకి వచ్చారని తెలుసుకుని ఆమె ఇక్కడకు వచ్చింది. అత్తంటి ముందు నిరసనకు దిగింది. తన భర్తను ఇంట్లోనే దాచి అత్తమామలు, మరిది నాటకాలు ఆడుతున్నారని ఆమె ఆరోపిస్తుంది.