Guntur Crime : పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణ పోలీసులు భారీ మొత్తంలో తెలంగాణ మద్యాన్ని పట్టుకున్నారు. సీఐ మధుసూధన్ రావు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టిన పోలీసులు బ్రిటానియా బిస్కెట్ల మాటున అక్రమంగా రవాణా చేస్తున్న 2000 మద్యం సీసాలు స్వాధీనం చేస్తుకున్నారు. తెలంగాణ నుంచి వినుకొండకు ఐచర్ వాహనంలో మద్యం తరలిస్తున్నట్లు సమాచారం. పిడుగురాళ్ల మండలం తుమ్మల చెరువు టోల్ ప్లాజా వద్ద పోలీసుల తనిఖీల్లో తెలంగాణ మద్యం పట్టుబడింది. సాధారణ తనిఖీలలో భాగంగా ఆదివారం తెల్లవారుజామున అనుమానంగా కనిపించిన ఐచర్ వాహనాన్ని సోదా చేస్తే సుమారు నాలుగు లక్షల రూపాయలు విలువ చేసే 50 కేసుల మద్యం రవాణా చేస్తున్న పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పిడుగురాళ్ల పట్టణ సీఐ మధుసూధన్ రావు తెలిపారు.
Guntur Crime : బ్రిటానియా బిస్కెట్ల మాటున తెలంగాణ మద్యం అక్రమ రవాణా, 2000 బాటిల్స్ సీజ్
ABP Desam
Updated at:
01 May 2022 06:43 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
Guntur Crime : బ్రిటానియా బిస్కెట్ల ముసుగులో అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యాన్ని పిడుగురాళ్ల పోలీసులు పట్టుకున్నారు. ఐచర్ వాహనంలో తరలిస్తున్న 2 వేల మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు.
తెలంగాణ మద్యం సీజ్