Kanteru Tension : గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరులో ఉద్రిక్తత నెలకొంది. గ్రామానికి చెందిన దళిత మహిళ కర్లపూడి వెంకాయమ్మ కుమారుడుపై మరో వర్గం వారు దాడికి పాల్పడ్డారు. వెంకయమ్మపై దాడికి కూడా ప్రయత్నించారు. ఈ దాడి నేపథ్యంలో టీడీపీ చలో కంతేరుకు పిలుపు నిచ్చింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కంతేరుకు టీడీపీ నేతలు రాకుండా ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. ముఖ్య నేతలను గృహనిర్బంధం చేశారు. తాడికొండ, కంతేరులో పోలీసులు భారీగా మోహరించారు. మాజీ మంత్రులు దేవినేని ఉమా, నక్కా ఆనంద్‌బాబు, మాజీ ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్‌కుమార్, తంగిరాల సౌమ్య తదితరులను పోలీసులు గృహనిర్బంధం చేశారు.


పోలీసులు ఎవరికీ బానిసనలు కాదు- డీఐజీ 


ఈ ఘటనపై డీఐజీ త్రివిక్రమ వర్మ మాట్లాడుతూ.. కంతేరులో గొడవ జరిగింది. సునీత, వంశీ అనే ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇద్దరి ఫిర్యాదులపై కేసులు నమోదు చేశాం. రెండు కేసుల్లో అరెస్టులు చేశాం. దర్యాప్తు కొనసాగుతోంది. దర్యాప్తు జరుగుతున్నప్పుడు శాంతిభద్రతలు సమస్య తలెత్తేలా గ్రామానికి వెళతామనడం కరెక్ట్ కాదు. దుగ్గిరాలలో రాళ్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. వెంకాయమ్మ ఇంటి వద్ద పికెట్ పెట్టాం. దుర్గిలో ఒకరి హత్య జరిగింది. వెంటనే ఆ హత్య కేసులో అరెస్టులు చేశాం. ఈ ఘటనను రాజకీయ చేయడం ఎంత వరకూ సమంజసం. పోలీసులు వైసీపీ బానిసలా అంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించినా దాఖలాలు ఉన్నాయా. మాజీ సీఎం బందోబస్తులో 150 మంది పోలీసులు ఉన్నారు. వారు బానిసలా. అన్ని రాజకీయ పార్టీలకు పోలీసులు భద్రత కల్పిస్తున్నారు. పోలీసులు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నా కించపరిచేలా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇటువంటి వ్యాఖ్యలతో పోలీసులు బాధపడుతున్నారు.


ఎస్పీ ఆరిఫ్ హాఫీజ్ కామెంట్స్


కంతేరు ఘటనలో రెండు కేసులు నమోదు చేశామని ఎస్పీ ఆరిఫ్ హాఫీజ్ అన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. పీఎస్ వద్దకు వెళ్లి ఇరు వర్గాలతో మాట్లాడానన్నారు. సునీత, వంశీ మధ్య జరిగింది వ్యక్తిగతమైన గొడవ అన్నారు. సీసీ కెమెరాలు విజువల్స్ కూడా ఉన్నాయని ఎస్పీ తెలిపారు. 


Also Read : CM Jagan Review : ఇక ఆరోగ్యశ్రీ పథకానికీ నగదు బదిలీ - అధికారులను ఆదేశించిన సీఎం జగన్


Also Read : Atmakur Bypoll: చంద్రబాబును మెచ్చుకున్న వైసీపీ ఎమ్మెల్యే, వెంటనే డిప్యూటీ సీఎం తీవ్ర వ్యాఖ్యలు