గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్య హత్య అత్యంత దురదృష్టకరమని గుంటూరు ఇంఛార్జ్‌ డీఐజీ రాజశేఖర్‌బాబు ఆయన పేర్కొన్నారు. రమ్య హత్య కేసు వివరాలను సోమవారం మీడియాకు వెల్లడించారు. సామాజిక మాధ్యమాల్లో ఏర్పడే పరిచయాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సంఘటన జరిగిన కొన్ని గంటల్లోనే నిందితుడు శశికృష్ణ పట్టుకున్నామని ఇంఛార్జ్‌ డీఐజీ తెలిపారు. పోలీసులు అదుపులోకి తీసుకునే సమయంలో నిందితుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని ఆయన తెలిపారు. 


Also Read: Ramya Murder: రమ్య మృతదేహం తరలింపు అడ్డగింత.. ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు, ఫ్యామిలీకి నగదు చెక్కు అందించిన హోంమంత్రి


సోషల్ మీడియా ఉచ్చులో పడకండి


శశికృష్ణ ఇన్‌స్టాగ్రాం ద్వారా రమ్యకు పరిచయం అయ్యాడని ఇంఛార్జ్‌ డీఐజీ రాజశేఖర్ బాబు అన్నారు. శశికృష్ణ వేధించడంతోనే రమ్య దూరం పెట్టిందన్నారు. ప్రేమించకపోతే చంపేస్తానని నిందితుడు బెదిరింపులకు పాల్పడ్డాడని ఇంఛార్జ్‌ డీఐజీ పేర్కొన్నారు. ప్రేమించలేదన్న కోపంతోనే రమ్యను శశికృష్ణ దారుణంగా హత్య చేశాడని తెలిపారు. నిందితుడ్ని ఇవాళ రిమాండ్‌కు తరలించనున్నట్లు పేర్కొన్నారు. సోషల్‌ మీడియా పరిచయాలపై అప్రమత్తంగా ఉండాలని కోరారు. డీజీపీ ఆదేశాల మేరకు యువతులు, మహిళలు సోషల్ మీడియా ఉచ్చులో పడకుండా అవగాహన కల్పిస్తున్నామన్నారు. మహిళలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. కొన్ని నేరాలను పోలీసు శాఖ మాత్రమే నివారించలేదన్నారు. సమాజమే స్పందించి అడ్డుకోవాలన్నారు.  నిందితులను గంటల వ్యవధిలో పట్టుకున్న గుంటూరు అర్బన్ పోలీసులను ఆయన అభినందించారు.


Also Read: Nara Lokesh Arrested: గుంటూరులో ఉద్రిక్తత... నారా లోకేశ్ అరెస్టు... టీడీపీ-వైసీపీ కార్యకర్తల తోపులాట


ఏం జరిగిదంటే...


గుంటూరు కాకాణి రోడ్డులో బీటెక్ విద్యార్థిని విద్యార్థిని రమ్యను (20) శశికృష్ణ (24) అనే యువకుడు కత్తితో పొడిచి అత్యంత దారుణంగా హత్య చేశాడు. గుంటూరు పరమయ్యగుంట సెంటర్ వద్ద ఆదివారం ఉదయం ఈ దారుణం జరిగింది. నిందితుడు శశికృష్ణను ఆదివారం రాత్రి అతని స్వగ్రామం వట్టిచెరుకూరు మండలం ముట్లూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధిత కుటుంబానికి ఏపీ సీఎం జగన్ రూ.10 లక్షల పరిహారం ప్రకటించింది. నిందితుడికి కఠినంగా శిక్షలు పడేలా చూడాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.


Also Read: Guntur Crime: గుంటూరు బీటెక్ విద్యార్థిని హత్య సీసీ కెమెరా దృశ్యాలు