Nara Lokesh Arrested: గుంటూరులో ఉద్రిక్తత... నారా లోకేశ్ అరెస్టు... టీడీపీ-వైసీపీ కార్యకర్తల తోపులాట

Continues below advertisement

 

గుంటూరులో ఆదివారం హత్యకు గురైన బీటెక్‌ విద్యార్థిని రమ్య కుటుంబ సభ్యులను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఇవాళ పరామర్శించారు. లోకేశ్ పరామర్శ సందర్భంగా గుంటూరులోని పరమయ్యగుంటలో ఉద్రిక్తత నెలకొంది. రాజకీయ లబ్ధికోసమే లోకేశ్‌ వచ్చారంటూ వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో టీడీపీ-వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పోటాపోటీ నినాదాలతో ఇరు వర్గాలు ఆరోపణలు చేసుకున్నాయి. పరిస్థితిని అదుపుచేసేందుకు పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. నారా లోకేశ్‌తో పాటు మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను పోలీసులు అరెస్ట్‌ చేశారు. లోకేశ్‌ను ప్రత్తిపాడు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మిగతా నేతలను వివిధ ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లారు. 

 

Also Read: Ramya Murder: నారా లోకేశ్ అరెస్టు.. సీఎం చెల్లెలికే ప్రాణ గండం.. ఇక మామూలు మహిళల పరిస్థితేంటన్న మాజీ మంత్రి

Also Read: Guntur Crime: గుంటూరు బీటెక్ విద్యార్థిని హత్య సీసీ కెమెరా దృశ్యాలు

 

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram