Guntur Crime News :     నర్సరావుపేటలో  ఓ యువతిని హత్య చేసిన ప్రేమోన్మాదికి కోర్టు జీవితఖైదు విధిచింది. సంచలనం సృష్టించిన ఈ కేసులో  నిందితుడు విష్ణువర్ధన్ రెడ్డికి   జీవిత ఖైదు విధిస్తూ నరసరావుపేట 13 వ అదనపు జిల్లా కోర్టు గురువారం తీర్పునిచ్చారు. ప్రేమకు, స్నేహానికి తేడా తెలియని ಓ సైకో యువతి నిండు ప్రాణాలు బలి తీసుకున్నాడు...ఇద్దరి మద్య ఉన్న చనువు,  అభిమానాన్ని  కూడా మర్చి పోయి కసి‌ తీరా గొంతు నులిమి చంపాడు...తనని వదిలేయమని తన మీద కేవలం స్నేహం మాత్రమే ఉందని...ప్రేమ లేదని చెప్ఫడంతో ఒక్క సారిగా మృగంగా మారి మరీ  ప్రాణం తీసాడు...ఈ కేసు  పూర్వాపరాల, సాక్ష్యాధారలు పరిశీలించిన న్యాయస్థానం హత్య జరిగినట్లు నిర్ధారించింది.   


విష్ణువర్ధన్‌రెడ్డి,  అనూష మంచి ఫ్రెండ్స్. నరసరావుపేట లోని కృష్ణవేణి డిగ్రీ కాలేజీలో బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతున్నారు. కొంత కాలంపాటు అనుష, విష్ణువర్ధన్ రెడ్డి స్నేహంగా ఉన్నారు. స్నేహమే కానీ వీరిదిదరి మద్య ప్రేమ వ్యవహారం లాంటిది లేదు.ఈ క్రమంలో అనూష తమ కాలేజీ లోనే చదువుతున్న మనోజ్ అనే వ్యక్తితో స్నేహంగా ఉండటం సహించలేక పోయాడు విష్ణువర్థన్ రెడ్డి.  23-02-2021 న అనూష, విష్ణు వర్ధన్ రెడ్డీ మద్య  వాగ్వాదం చోటు చేసుకుంది.  సంబంధం లేక పోయినా ఆమెపై అనుమానంతో రగిలిపోయాడు. తనకు దక్కని అనూష ఇంకెవరికీ దక్కకూడదని అనుకున్నాడు.                   


మరుసటి రోజు అంటే 24-02-2021 నఉదయం 10.30 గంటల సమయంలో అనూష రావిపాడు రోడ్డులోని రిలయన్స్‌ ట్రెండ్స్‌ వద్ద బస్సు దిగగానే ఆటోలో ఆమెను బలంతంగా ఎక్కించాడు. తర్వాత రావిపాడు పెట్రోలు బంక్‌ వద్ద తీసుకు వెళ్ళాడు. ఆనూష గొడవ చేయకుండా ఉండేందకు ఆమాయకంగా నటించాడు.. ఆమెతో మాట్లాడాలంటూ ప్రాధేయపడి పాలపాడు వైపు వెళ్లే గోవిందాపురం మైనర్‌ కాల్వ కట్ట వద్ద గల సుబాబుల్ తోటకు సమీపంలో నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతానికి తీసుకెళ్లాడు. మనోజ్ గురించి ప్రశ్నించాడు.  మీ ఇద్దరికి ఉన్న సంభంధం ఏమిటని ప్రశ్నించాడు. ఆమె చెప్పిన ఆన్సర్ తో  రగిలిపోయిన విష్ణువర్ధన్ రెడ్డి ఆమెపై దాడి చేశాడు. కిందపడిన అనూషను గొంతు నులిమి చంపేశాడు.                                                   


అనంతరం హత్యకు సంబంధించిన ఆధారాలను మాయం చేయడం కోసం మృతదేహాన్ని చేతులతో మోసుకెళ్లి కొద్దిదూరంలో గోవిందాపురం మైనర్‌ కాల్వలో పడేశాడు.తర్వాత మృతదేహంపై పాత గోనెసంచి,గడ్డి కప్పాడు.అక్కడి నుండి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు..  హత్యా కేసును నమోదు చేసుకున్న పోలీసులు...కేసుకు సంబంధించిన ప్రతి చిన్న ఆధారాన్ని వదల‌ కుండా ఇన్వెస్టిగేషన్ చేసారు...కీలక ఆధారాలు సేకరించి న్యాయస్థానం ముందు ఉంచారు...సాక్షాధారలను పరిశీలించిన న్యాయ మూర్తి విష్ణువర్ధన్ రెడి హత్య చేసినట్లుగా భావించి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది...