Shakuntalam: పాన్ ఇండియా రేంజ్ లో ఏప్రిల్ 14న విడుదల కానున్న 'శాకుంతలం' సినిమాకు అంతా సిద్ధమైంది. ఈ తరుణంలోనే ఓ ఫొటోను షేర్ చేసిన సమంత.. కేఆర్ విజయ, ఎంఎస్ సుబ్బలక్ష్మి, సరోజా దేవి, జయశ్రీ, జయప్రద లాంటి ఫేమస్ హీరోయిన్లు చేసిన పాత్రలతో తనను కంపేర్ చేయడంపై స్పందిస్తూ.. నిజంగా గౌరవంగా భావిస్తున్నానంటూ సమంత పోస్ట్ చేసింది. రేపట్నుంచి 'శాకుంతలం' మీదేనంటూ రాసుకొచ్చింది.


గుణ శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'శాకుంతలం' రిలీజ్ డేట్ దగ్గరికొచ్చేసింది. సమంత ఫ్యాన్స్ ఎప్పట్నుంచో ఆత్రుతగా ఎదురుచూస్తోన్న సమయానికి మరో 24గంటలే ఉంది. పాన్ ఇండియా రేంజ్ లో రూపుదిద్దుకున్న ఈ సినిమా కోసం మేకర్స్ ఎంత కష్టపడ్డారో.. అంత కన్నా రెట్టింపు కష్టం సమంత పడింది. మెంటల్ గా ఎన్ని ఎమోషన్స్ అడ్డొచ్చినా.. ఫిజికల్ గా ఇటీవలే ఓ వ్యాధి నుంచి బయటపడి మళ్లీ ఫిట్ గా ఉండేందుకు సాయ శక్తులా కృషి చేసింది. అలసటను, విచారాన్ని ఎక్కడా కనిపించకుండా ఇప్పటికీ ఆ చిన్న స్మైల్ తోనే  అందర్నీ ఆకట్టుకుంటూ ఈ రోజు ఇంత పెద్ద ప్రాజెక్టును పూర్తి చేసిందంటే మాటలు కాదు. అంత గొప్ప గౌరవమూ అందరికీ దక్కదు. కొన్ని సినిమాలు చేసే అందరికీ అవకాశం రావు. కానీ సమంతకు ఆ ఛాన్స్ వచ్చింది. దాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంది కూడా. అందుకే ఆ గౌరవానికి ప్రతీకగా తాజాగా ఇన్స్ స్టా పోస్ట్ చేసింది.  దాంతో పాటు ఓ ఫొటోను షేర్ చేసిన సమంత... ప్రముఖ హీరోయిన్లు, వాళ్లు నటించిన పాత్రల పక్కన తన ఫొటోను పెట్టడంపై ఆనందం వ్యక్తం చేసింది. నిజంగా గౌరవంగా ఫీలవుతున్నానంటూ రాసుకొచ్చింది. 'శాకుంతలం' రేపట్నుంచి ఇక మీదే నంటూ ఓ ఎమోషనల్ కోట్ ను కూడా సమంత యాడ్ చేసింది.


ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో వెండి తెరపై  మరోసారి సమంతను చూసి ఎంజాయ్ చేయడానికి ఆమె ఫ్యాన్స్ ఉత్సాహంగా రెడీ అవుతున్నారు. ఈ పోస్ట్ పై స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. మీరొక్కరే 'శకుంతల' పాత్రకు న్యాయం చేయగలరు అంటూ ఆమెను కొనియాడుతున్నారు.






ఇక 'శాకుంతలం' సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో.. మేకర్స్ ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. అందులో భాగంగా సమంత కూడా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ రీసెంట్ డేస్ లో తన వ్యక్తిగత జీవితంపై పలు వ్యాఖ్యలు చేస్తూ హాట్ టాపిక్ గా నిలుస్తోంది. ఇంతలోనే ఆమె మరోసారి అస్వస్థతకు గురయ్యానంటూ సమంత ఇటీవల చేసిన ఓ ట్వీట్ సైతం వైరల్ గా మారింది. గత కొన్ని రోజుల క్రితం 'మయోసైటిస్' అనే అరుదైన వ్యాధి నుంచి కోలుకున్న సమంత.. రీసెంట్ గా మూవీ ప్రమోషన్స్, ఇంటర్వ్యూలు అంటూ బిజీగా అయిపోయింది. దీంతో కాస్త అలసిపోయి అస్వస్థతకు గురయ్యానని, మాట్లాడడానికి కూడా ఇబ్బందిగా ఉందంటూ పోస్ట్ లో రాసుకొచ్చింది. దీంతో వార్తా ఛానెళ్లు మళ్లీ ఆమెపై పడి.. మళ్లీ సమంతకు తీవ్ర అస్వస్థత.. అని కథనాలు ప్రచురించడం మొదలు పెట్టాయి.


ఇక 'శాకుంతలం' విషయానికొస్తే.. 2 డీ తో పాటు 3 డీలోనూ విడుదల కానున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 14న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే రిలీజైన మూవీలోని సాంగ్స్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో.. ఈ భారీ బడ్జెట్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు వసూలు చేస్తుందని సినీ అభిమానులతో పాటు, ఆమె ఫ్యాన్స్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
మూవీ రిలీజ్ నేపథ్యంలో ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.