Bathinda Military Station Firing: 


డ్యూటీలో ఉండగా మృతి 


పంజాబ్‌లోని బఠిండా మిలిటరీ స్టేషన్‌లో మరోసారి కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ జవాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దగ్గర్లోని ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు దక్కలేదు. ఏప్రిల్ 11వ తేదీన సెలవులు ముగించుకుని డ్యూటీలో చేరాడు. సెంట్రీ డ్యూటీ చేస్తుండగా కాల్పులు జరిగాయి. గన్‌షాట్ కారణంగానే జవాన్ మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. 


"గన్‌షాట్ కారణంగా ఓ జవాన్ మృతి చెందాడు. సర్వీస్‌ వెపన్‌తో సెంట్రీ డ్యూటీ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ఆ వెపన్‌తో పాటు క్యాట్‌రిడ్జ్‌ కూడా జవాన్‌ పక్కనే పడి ఉన్నాయి. సమీపంలోని మిలిటరీ హాస్పిటల్‌కి తీసుకెళ్లినా లాభం లేకుండా పోయింది. అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. అంతకు ముందు జరిగిన ఘటనతో దీనికి ఎలాంటి సంబంధం లేదు."


- ఆర్మీ అధికారులు 
 
ఈ ఘటన ఎలా జరిగిందని ఆరా తీస్తున్నారు అధికారులు. ఆత్మహత్య చేసుకున్నాడా..? అన్న కోణంలో విచారిస్తున్నారు. 


"ఈ జవాన్ ఏప్రిల్ 11వ తేదీ సెలవులు ముగించుకుని వచ్చాడు. డ్యూటీలో చేరాడు. ఇంతలోగా ఇలా జరిగింది. ఇది ఆత్మహత్యగా  అనుమానిస్తున్నాం"


- ఆర్మీ అధికారులు