దేశమంతా 75వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న ఈ తరుణంలో గుంటూరులో ఘోరం జరిగింది. కఠిన చట్టాలు అమలు చేస్తున్నా.. మహిళలపై దాడులు మాత్రం ఆగడం లేదు. గుంటూరులోని పరమాయికుంట వద్ద టిఫిన్ తీసుకెళ్లేందుకు​వచ్చిన ఓ యువతి దారుణ హత్యకు గురైంది. ఈ ఘటనతో గుంటూరు ఉలిక్కిపడింది. స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గుంటూరు పెదకాకాని రోడ్డులోని పరమాయికుంటలో టిఫిన్ తీసుకెళ్లేందుకు వచ్చిన యువతిపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. రక్తపు మడుగులో ఉన్న బాధితురాలిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో చనిపోయింది. యువతిపై కత్తితో దాడి చేస్తున్న సమయంలో అడ్డుకునేందుకు కొందరు స్థానికులు ప్రయత్నించారు. కానీ దుండగుడు స్థానికులను కత్తితో బెదిరించి ద్విచక్రవాహనంపై పరారయ్యాడు.


Also Read: Volunteer suicide : అనంతపురం జిల్లా రాయదుర్గంలో వాలంటీర్ ఆత్మహత్య.. సీఎంకు రాసిన లేఖలో ఏం చెప్పారంటే..?


పరిచయం ఉన్న యువకుడి పనే..


ఈ దారుణ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. యువతి మృతదేహాన్ని గుంటూరు సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు గల కారణాలను మృతురాలి తల్లి, సోదరుడిని గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ అడిగి తెలుసుకున్నారు. బాధిత యువతి ఇంజినీరింగ్ 4వ సంవత్సరం చదువుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. యువతికి పరిచయం ఉన్న యువకుడే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్థరించారు. యువతి మృతితో తల్లిదండ్రులు, బంధువులు తీరని శోకంలో మునిగిపోయారు. 


Also Read: Wanaparthy News: గేదెపై వ్యక్తి అత్యాచారం.. నగ్నంగా అక్కడిక్కడే మృతి, అసలేం జరిగిందంటే..


మెడ, కడుపులో కత్తి పోట్లు..


గుంటూరు నగరం కాకాణి రోడ్డులో జరిగిన ఈ దారుణ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయ్యింది. స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటూ అందరూ ఆనందంలో ఉన్న సమయంలో బీటెక్ విద్యార్థిని హత్యతో గుంటూరు వాసుల్ని ఉలిక్కి పడేలా చేసింది. పట్టపగలే ఓ దుండగుడు విద్యార్థినిపై కత్తితో దాడిచేయగా ఆమె చనిపోయింది. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్‌ కళాశాలలో బీటెక్‌ నాల్గో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కాకాణి రోడ్డులో టిఫిన్ తీసుకెళ్లేందుకు వచ్చింది. అటుగా వచ్చి ఓ యువకుడు యువతిని తన బైక్‌పై ఎక్కాలని కోరాడు. అందుకు ఆమె నిరాకరించింది. దీంతో యువకుడు తన వెంట తీసుకొచ్చిన పదునైన కత్తితో విద్యార్థిని మెడ, పొట్ట భాగంలో పొడిచాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. రక్తపు మడుగులో ఉన్న యువతిని స్థానికులు గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.


కేసు నమోదు


గుంటూరు జీజీహెచ్ లో ఉన్న విద్యార్థిని మృతదేహాన్ని అర్బన్‌ ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాల్సిందిగా పాత గుంటూరు పోలీసులను ఎస్పీ ఆదేశించారు. 


Also Read: Watch: జెండా ఎగరేస్తుండగా కొట్టుకున్న టీఆర్ఎస్-బీజేపీ నేతలు.. ఆస్పత్రి పాలైన బీజేపీ నేత