కర్నూలు జిల్లా కోసిగి మండలం మూగులదొడ్డిలో ఓ వివాహితను అదే గ్రామానికి చెందిన వాలంటీర్ వేధిస్తున్నాడు. తరచూ ఫోన్ చేస్తూ నీవు అంటే ఇష్టమని సతాయించాడు. అవసరమైతే డబ్బులు ఇస్తాను.. కోరిక తీర్చాలంటు వెంటపడేవాడు. దీంతో ఎవరికి చెప్పుకోవలో అర్థం కాక ఆ మహిళ చాలా రోజులు లోలోనే కుమిలిపోయింది. 


ఓ రోజు ఎప్పటి మాదిరిగానే ఫోన్‌ చేశాడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. అటు నుంచి ఆమెకు బదులు మగ గొంతు వినిపించింది. వెంటనే అసలు ఆ ఫోన్‌ నీ దగ్గర ఎందుకు ఉందని ప్రశ్నించాడు. నువ్వెందుకు ఫోన్‌ ఎత్తావని దబాయించాడు.   


మీ చిన్నమ్మతో మాట్లాడాలి అంటూ అసభ్యకరంగా మాట్లాడాడు వాలంటీర్‌. విషయాన్ని తన చిన్నమ్మకు చెప్పాడు ఆ కుర్రాడు. అప్పుడు జరుగుతున్న తతంగాన్ని చెప్పిందామె. ఎప్పటి నుంచి తనను వాలంటీర్‌ వేధిస్తున్నాడని... చాలా ఇబ్బందిగా ఉందని చెప్పింది. 


మూగులదోడ్డి గ్రామనికి చెందిన గర్జప్ప అనే వాలంటీరు ఓ మహిళా ఫోన్ నెంబర్ తీసుకొని అసభ్యంగా మాట్లాడాడని పేర్కొంది. ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాల పేరుతో ఆ మహిళ ఫోన్ నెంబర్ తీసుకొని తరచూ ఇంటికి వెళ్లేవాడు. తన కోరిక తీర్చకుంటే పథకాలు అందకుండా చేస్తానంటూ బెదిరింపులకు దిగేవాడు. 


ఎప్పుడు పడితే అప్పుడు మహిళకు ఫోన్ చేస్తు అసభ్యకరంగా మాట్లాడేవాడు. డబ్బులు ఇస్తాను, తన కోరిక తీర్చాలంటు సతాయించేవాడు. విషయం అర్థం చేసుకున్న ఆ కుర్రాడు గ్రామ పెద్దల వద్దకు పంచాయితీ తీసుకెళ్లాడు. 


సమస్య తీవ్రతను గుర్తించి గర్జప్ప అనే వాలంటీరుపై ఆ గ్రామ పెద్దలతో కలిసి ఆ మహిళా కోసిగి పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. జరుగుతున్న తతంగాన్ని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విషయంపై Si రాజారెడ్డిని వివరణ కోరగా బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కచ్చితంగా అతనిపై చర్యలు తీసుకుంటామన్నారు.