ఆయనో  మధ్య తరగతి తండ్రి. కుమార్తెకు పెళ్లీడు రాగానే పెళ్లి చేశాడు. కానీ ఆ కుమార్తె దారి తప్పింది. కట్టుకున్న భర్తతో సరిగ్గా కాపురం చేయకుండా ఇతరులతో ప్రేమ వ్యవహారాలు నడిపింది. చాలా సార్లు గొడవలు అయ్యాయి. అయినప్పటికీ అల్లుడికి ఆయన  సర్ది చెప్పాడు. కానీ ఈ సారి ఆ కూతురు తన ప్రియుడితో కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. వారం రోజుల పాటు ముంబైలో ఇతర చోట్ల తిరిగేసి.. ఇంటికి తిరిగి వచ్చింది. కానీ భర్త ఇంట్లోకి రానివ్వలేదు. అప్పుడు ఆ తండ్రి ఓ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. తన కుమార్తెను ఏమీ అనలేదు..కానీ తన కుమార్తెతో ప్రేమ వ్యవహారం నడుపుతున్నవాడ్ని అడ్డు తొలగించాలనుకున్నాడు.కానీ చివరిలో ప్లాన్ అడ్డం తిరిగింది. 


జూమ్ కారులో గంజాయి రవాణా, స్మగ్లర్ల ఎత్తును చిత్తు చేసిన పోలీసులు


 వేములవాడ తిప్పాపూర్ పోలీసులు ఉదయం ఆరు గంటలకు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తులు వేములవాడ బైపాస్ వద్ద కారులో అనుమానాస్పదంగా కనిపించారు.  వారిద్దరు పోలీసులను చూసి కారుతో సహా పారిపోవడానికి యత్నించగా పోలీసులు వారిని పట్టుకున్నారు. పోలీసుల్ని ఎందుకు పారిపోతున్నారని తమదైన శైలిలోబయటకు రప్పించారు. దాంతో సుపారీ కథ బయటకు వచ్చింది. 


భర్తను చంపేసి వడ్డీవ్యాపారులపైకి నెట్టేసింది- ఆమె మర్డర్ ప్లాన్‌ తెలిసి పోలీసులకు చెమటలు పట్టాయి


సిరిసిల్లకు చెందిన  నీలం శ్రీనివాస్ మనోజ్ అనే వ్యక్తిని హత్య చేయడానికి వీరిద్దరికి సుపారీ ఇచ్చాడు. ఎందుకంటే ఆ మనోజ్ శ్రీనివాస్ కుమార్తెతో వివాహేతర బంధం పెట్టుకున్నాడు. పెళ్లి అయిన కుమార్తె కాపురాన్ని ఆయన చెడగొడుతున్నాడని శ్రీనివాస్ కోపం పెంచుకున్నారు. ఇటీవల మనోజ్‌తో కలిసి  వారం రోజుల పాటు ఎవరికీ తెలియకుండా ముంబయి వెళ్ళి వచ్చారు. శ్రీనివాస్ కుమార్తె భర్త ఆమెను ఇంట్లోకి రానిచ్చేందుకు అంగీకరించలేదు. దీంతో  శ్రీనివాస్ తన స్నేహితుడైన కుంటయ్యతో కలిసి తన కూతురి కాపురం చక్కబెట్టడానికి మనోజ్ హత్యకు  పథకం పన్నారు. 


హైదరాబాద్‌లో పరువు హత్య- చెల్లెలి భర్తను కిరాతకంగా చంపేసిన సోదరుడు


దీనికి బీహార్ కు చెందిన లఖింద్ర సాహ్ని,బొమ్మడి రాజ్ కుమార్ లతో రూ ఐదు లక్షలకు సుపారీ మర్డర్ చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే మనోజ్ జాతకం బాగుండి సుపారీ ముఠా పోలీసులకు పట్టుబడింది. వారి వద్ద నుండి కత్తులు మరియు నగదును స్వాధీనం చేసుకున్నారు.  నీలం శ్రీనివాస్ మరియు కుంటయ్యను కూడా అదుపులోకి తీసుకున్నారు.వీరిపై కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు.