ఆంధ్రప్రదేశ్‌లో ( AP ) మహిళలపై అత్యాచారాల ఘటనలు సంచలనాత్మకం అవుతున్న సమయంలో మహిళా పోలీసులు ( Women Police )  కూడా తమపై అఘాయిత్యం జరిగిందని పోలీసుల్ని ఆశ్రయిస్తున్నాయి. విజయనగరం జిల్లా ( Vijayanagaram )  శృంగవరపు కోట (S KOta ) మండలంలో ముసిడిపల్లి గ్రామ సచివలాయంలో పని చేస్తున్న  మహిళా పోలీస్  ను ప్రేమ పేరుతో వంచించి తనపై అఘాయిత్యానికి పాల్పడ్డారని అదే సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.  


చంద్రగిరి ఎస్ఐ ఆరెస్ట్ - ఈయన నిర్వాకానికి ఓ యువతి ప్రాణం బలి !


శృంగవరపుకోట మండలం, ముషిడిపల్లి సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ గా పని చేస్తున్న నవీన్ అదే సచివాలయంలో పని చేస్తున్న ‌మహిళా పోలీస్ ఉద్యోగికి పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారి చివరకు పెళ్లి వరకూ వచ్చింది. ఇరు కుటుంబాలు పది నెలల క్రితం ఇద్దరికీ వివాహం చేయడానికి నిశ్చయించారు. ఈలోగా శారీరకంగా ఇద్దరూ పలు మార్లు కలిసారు. .నవీన్ ప్రియురాలికి తెలియకుండా తన న్యూడ్ ఫోటోలను తీసి తన మొబైల్ లో భద్రపరిచాడు. ఇటీవల ఇద్దరి మధ్య జరగాల్సిన పెళ్లి కట్నం విషయంలో క్యాన్సిల్ అయింది. దీన్ని జీర్ణించుకోలేక  ప్రియుడు నవీన్ తన ప్రియురాలి అసభ్యకర ఫోటోలను ప్రియురాలి తండ్రికే పంపించాడు. దీంతో అమ్మాయి కుటుంబంలో వివాదం మొదలైంది.  ఈ అంశంపై మహిళా పోలీస్‌తో పాటు ఆమె తల్లిదండ్రులు కూడా పోలీసులను కలిసి ఫిర్యాదు చేశారు. ఇంతా చేసి ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితుడు రెడ్డి నవీన్‌గా ( Reddy Naveen ) గుర్తించారు. కేసు నమోదు చేసి రెడ్డి నవీన్ ను అదుపులోకి తీసుకున్నారు శృంగవరపుకోట పోలీసులు.  కేసును దర్యాప్తు చేస్తున్నారు. 


అవును వారిద్దరూ అబ్బాయిలే - ప్రేమలో గెలిచేందుకు లింగ మార్పిడి, సీన్ కట్ చేస్తే పోలీస్ స్టేషన్‌కు చేరిన ప్రేమాయణం


గ్రామ సచివాలయంలో ఉండే ఇద్దరి ఉద్యోగుల మధ్య ఏర్పడిన ప్రేమ వ్యవహారం ఇలా లైంగిక దాడి కేసుగా ( Rape Case ) మారడం విజయనగరం జిల్లాలో సంచలనాత్మకం అయింది. గ్రామంలో సచివాలయ పరిధిలో మహిళలకు అండగా ఉండాల్సిన మహిళా పోలీసుకే రక్షణ లేదని.. ఇంకెవరికి రక్షణ కల్పిస్తారని విపక్ష నేతలు విమర్శించడం ప్రారంభించారు. పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 


ఇడ్లీ ఇస్తే తీసుకోలేదని యాచకుడి హత్య, దర్యాప్తులో షాకింగ్ విషయాలు


కొద్ది రోజులుగా ఏపీలో లైంగిక దాడి ఘటనలు కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వం నేరస్తులకు అండగా ఉంటోందన్న అభిప్రాయం కలగడం వల్లే నేరస్తులు చెలరేగిపోతున్నారని.. విమర్శలు వినిపిస్తున్నాయి. ఎప్పటికప్పుడు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా .. మహిళలపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు.