ఆయనో సబ్ ఇన్స్‌పెక్టర్. ( SI ) చేయాల్సిన పని నేరాలను అరికట్టడం. కానీ తన పోలీస్ డ్రెస్‌ను చూపించి అమ్మాయిలను వలలో వేసుకోవడం.. వంచించడాన్నే అలవాటుగా చేసుకున్నాడు. ఇలా వంచనకు గురైన  ఓ యువతి ఆత్మహత్య ( Women Suiside ) చేసుకోవడంతో..  ఇప్పుడు ఊచలు లెక్కబెడుతున్నారు. ఆ ఎస్‌ఐ పేరు విజయ్ కుమార్.  ( SI Vijaykumr ) ప్రస్తుతం చంద్రగిరి ( Chandragiri PS ) పోలీస్ స్టేషన్‌లో పని చేస్తున్నారు. 


అవును వారిద్దరూ అబ్బాయిలే - ప్రేమలో గెలిచేందుకు లింగ మార్పిడి, సీన్ కట్ చేస్తే పోలీస్ స్టేషన్‌కు చేరిన ప్రేమాయణం


అనంతపురం జిల్లా, జి ఏ కొట్టాల కు చెందిన సరస్వతి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం ( Suiside ) చేసింది. తాను ఆత్మహత్య చేసుకోవడానికి చంద్రగిరి ఎస్ఐ విజయ్ కుమార్ కారణం అని మరణ వాంగ్మూలంలో చెప్పింది. అతను తనను ఎలా ప్రేమ పేరుతో మోసం చేశాడో కూడా వివరించింది. ఆమెను రక్షించేందుకు వైద్యులు తీవ్ర ప్రయత్నాలు చేసినా ఫలితం కనిపించలేదు. ఆమె చనిపోయింది. తిరుపతిలో ( Tirupati ) డిగ్రీ చదువుతున్న సమయంలో ఎస్ ఐ విజయ్ కుమార్ ఆమెను ట్రాప్ చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. 


36 ఏళ్ల మహిళపై పోక్సో కేసు - ఎంత ఘోరానికి పాల్పడిందంటే ?


అయితే విజయ్ కుమార్ ఒక్క సరస్వతినే కాదు మరికొంత మంది అమ్మాయిల్ని కూడా ట్రాప్ చేశారు. ప్రేమ పేరుతో మోసం చేయడంతో ఇటీవల దిశ పోలీస్‌ స్టేషన్‌లో ( Disa Police Station )   ఓ యువతి ఫిర్యాదు చేసింది. దీంతో ఎస్‌ఐ ఆ యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన సరస్వతి తాను మోసపోయానని భావించి ఆత్మహత్య చేసుకుంది.  


విశాఖలో కలకలం - విద్యార్థిపై దాడి చేసిన గసగసాలు, ఎలక !
 
 సరస్వతి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు తాడిపత్రి పోలీసులు ( Tadipatri Police )  కేసు నమోదు చేశారు. చంద్రగిరిలో అతడిని అదుపులోకి తీసుకొని  రిమాండ్‌కు తరలించినట్లుగా తాడిపత్రి డీఎస్పీ ప్రకటించారు. ఎస్‌ ఐ పై కేసు నమోదు చేశామని గతంలోనూ ఇలాంటి ఫిర్యాదులొచ్చాయని డీఎస్పీ  చైతన్య  ( DSP Chaitanya ) తెలిపారు. ఫిర్యాదులొస్తే వివాదాల మధ్యే విజయకుమార్‌ వివాహం జరిగిందన్నారు. మహిళలను ఎవరైనా  వేధిస్తే కాపాడాల్సిన పోలీసు తానే ప్రేమ పేరుతో ట్రాప్ చేయడంతో ఓ యువతి ప్రాణం బలైపోయింది.