గుడిహత్నూర్: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఓ బాలికను స్నేహం పేరిట పరిచయం చేసుకుని, ఆపై వీడియోలు తీసి మానసికంగా, లైంగికంగా వేధించిన 8 మందిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Continues below advertisement


వీడియోలు రికార్డు చేసి ఫ్రెండ్స్‌కు ఇచ్చిన మైనర్ బాలుడు


స్నేహం పేరుతో బాధిత బాలికకు దగ్గరైన ఓ మైనర్ అబ్బాయి.. సోషల్ మీడియా వేదికగా చేసిన చాట్ ను అడ్డుపెట్టుకుని బ్లాక్ మెయిల్ చేశాడు. బాలికతో వీడియో కాల్స్ మాట్లాడి.. వాటిని రికార్డ్ చేసుకుని, తన స్నేహితులతో పంచుకున్నాడు ఆ బాలుడు. ఆ వీడియోను అడ్డుపెట్టుకొని బాలుడి స్నేహితులు సైతం బాలికను వేదించడం ప్రారంభించారు. దీంతో మానసికంగా కృంగిపోయి విసిగిపోయిన బాధితురాలు చివరికి ధైర్యం చేసి విషయాన్ని తల్లితండ్రులతో చెప్పి, వారు షీటీమ్ పోలీసులను ఆశ్రయించారు.


బాలిక ఫిర్యాదు మేరకు రంగంలో దిగిన షి టీమ్ పోలీసులు బాలికను వేదిస్తున్న 8 మందిని నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఆరుగురు మేజర్లు కాగా, ఇద్దరు మైనర్లు ఉన్నారు. మైనర్లను ఇద్దరినీ ప్రత్యేకంగా రిమాండ్ సీడీతో జువెనల్ కోర్ట్ జడ్జి, ఆదిలాబాద్ ముందు హాజరు పర్చారు. మిగతా ఆరుగురు  A1) సజ్జన్వార్ వంశీ కృష్ణ(20), A2) పవార్ తరుణ్(18), A3) సాబ్లే బాలవంత్ సింగ్(18),  A4) గుండల్వార్ వరుణ్(18), A5) కారడ్ సుధీర్(28), A6)ముర్కుటే విట్టల్(23) ఉన్నారు. 




వీడియోలతో బాలికకు లైంగిక వేధింపులు


ఒక మైనర్ బాలికతో చిన్ననాటి స్నేహం పేరుతో దగ్గరయ్యాడు బాలుడు. సోషల్ మీడియాలో మైనర్ బాలుడు ఆ బాలికతో ఛాటింగ్ చేశాడు. ఆ చాటింగ్ ను బాలిక తల్లిదండ్రులకు, అందరికీ తెలిసేలా చేస్తానని బ్లాక్ మెయిల్ చేశాడు. ఆమెతో న్యూడ్ కాల్ చేయించి, ఆ తతంగాన్ని రికార్డు చేసి, తన స్నేహితులకు షేర్ చేశాడు. ఆ వీడియోను అడ్డుపెట్టుకుని బాలికను గత కొంతకాలం నుంచి లైంగికంగా, మానసికంగా వేధించారు. చివరికి ధైర్యం చేసిన బాలిక తన తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఎనిమిది మందిపై గుడిహత్నూర్ పోలీస్ స్టేషన్ లో పోక్సో కేసు నమోదు చేసినట్లు ఉట్నూర్ ఎ.ఎస్పి కాజల్ సింగ్ తెలిపారు.


సమస్య ఉంటే ఈ నెంబర్ కు ఫిర్యాదు చేయండి


మైనర్ అమ్మాయిని లైంగికంగా వేధించడం లాంటివి చేయడంతో షీ టీం సహాయంతో, గుడిహత్నూర్, ఇచ్చోడ పోలీసులు సీఐ బండారి రాజు ఆధ్వర్యంలో ఎనిమిది మందిని అదుపులోక తీసుకున్నారు. వీరిలో ఇద్దరు మైనర్ లు ఉన్నారు. మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా రిమాండ్ విధించారు. ఎవరైనా ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడితే కేసులు నమోదు చేయడంతో పాటు కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఆదిలాబాద్ షీ టీం మహిళలకు అండగా ఎల్లవేళలా ఉంటుందని, మహిళలు ఎలాంటి అత్యవసర సమయంలోనైనా 8712659953 నెంబర్ లో సంప్రదించాలని సూచించారు. తల్లిదండ్రులు పిల్లలు చేసే పనులను గమనించాలని, లేకపోతే ఇలాంటి కేసుల్లో ఇరుక్కుని జీవితాలు నాశనం చేసుకుంటారని హెచ్చరించారు.