వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ( YS Viveka Murder Case ) సీబీఐ దూకుడు పెంచింది. వివేకా కేసు అప్రూవర్‌గా మారిన దస్తగిరిని పులివెందుల కోర్టులో ( Pulivendula Court ) సీబీఐ హాజరుపర్చింది. అప్రూవర్‌గా మారేందుకు కోర్టు అంగీకరించినందున మరోసారి అప్రూవర్‌గా దస్తగిరి ( Dastagiri ) వాంగ్మూలాన్ని సీబీఐ అధికారులు నమోదు చేస్తున్నారు. గతేడాది ఆగస్ట్ 31న ప్రొద్దుటూరు కోర్టులో ( Proddutur Court ) దస్తగిరి వాంగ్మూలం ఇచ్చారు. అయితే అప్పటికి అప్రూర్‌గా మారలేదు అందుకే మరోసారి వాంగ్మూలాన్ని నమోదు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
సంపూర్ణ ఆరోగ్యం - క్రమం తప్పని వ్యాయామం ! అయినా ఎందుకిలా ?
వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి ( MP Avinash Reddy ) సన్నిహితుడు, వైఎస్ఆర్‌సీపీ ( YSRCP ) రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని సీబీఐ నిందితుడిగా చేర్చింది. అంతకు ముందు ఓ చార్జిషీట్ దాఖలు చేసింది. ఇటీవల దాఖలు చేసిన చార్జిషీట్‌లో ప్రధానంగా ఎంపీ అవినాష్ రెడ్డిపైనే అనుమానం వ్యక్తం చేయడంతో ఆయనను ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో సీబీఐ డీఐజీ చౌరాసియా కూడా కపులివెందులకు వచ్చారు.
వ్యాపారంలో సక్సెస్, పాలిటిక్స్‌లో మేటి ! గౌతమ్ రెడ్డికి సంబంధించిన ముఖ్య విశేషాలు ఇవే..
2019 మార్చి 15న వివేకా తన ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యారు. తన తండ్రి హత్య కేసులో సిట్ విచారణలో పురోగతి లేదని, సీబీఐకి అప్పగించాలని కోరుతూ వివే కా కుమార్తె సునీత ( YS Sunita ) హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టుకు సీబీఐకి అప్పగించిన తర్వాత దర్యాప్తు మెల్లగా సాగుతోంది. ఇటీవల సీబీఐ వేగం పెచింది. దస్తగిరి అప్రూవర్‌గా మారడాన్ని కడప చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ అంగీకరించింది. దీన్ని హైకోర్టు సమర్థించింది.
అర్ధరాత్రి బెజవాడ పీఎస్‌లో ఎంపీ నందిగాం సురేష్ హల్‌చల్.. అసలు ట్విస్ట్ ఏంటంటే
సీబీఐ దర్యాప్తు ఓ కొలిక్కి వస్తూండటంతో విచారణ అధికారులపైనా కొంత మంది ఆరోపణలు చేస్తూ పోలీసుల్ని కలుస్తున్నారు. గతంలో అనంతపురం, కడప ఎస్పీల్ని కలిసి సీబీఐ అధికారులు తమను వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. గత వారం మరో అనుమానితుడు కడప ఏఎస్పీని కలిసి అదే 0కమైన ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదులపై ఏపీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.