ఆంధ్రప్రదేశ్ మంత్రి గౌతంరెడ్డి ( Mekapati Goutham Reddy ) హఠాన్మరణం అందర్నీ కలచి వేస్తోంది. ఆయన వయసు యాభై ఏళ్లు మాత్రమే. అంతే కాదు ఆయన ఆరోగ్య పరంగా చాలా ఫిట్‌గా ఉంటారు. జిమ్, యోగా ( Yoga ) రెగ్యూలర్‌గా చేస్తారు. డైట్ ఫుడ్ ఫాలో అవుతారు. అందుకే ఆయనకు రెండు సార్లు కరోనా ( Corona ) సోకినా లక్షణాలు కూడా పెద్దగా బయటపడలేదు. త్వరగానే కోలుకున్నారు. అందుకే ఆయన మరణం అంటే చాలా మంది నమ్మలేకపోతున్నారు. గుండెపోటు ( Heart Attack ) అంటే అసలే నమ్మలేకపోతున్నారు.
దూకుడైన పార్టీలో సంప్రదాయ నేత ! ఎవర్నీ అనని, అనిపించుకోని లీడర్ గౌతంరెడ్డి !
గౌతంరెడ్డి ఆరోగ్యమే మహాభాగ్యం అనుకునే వ్యక్తి. ఆయన ఎత్తుకు తగ్గ వెయిట్‌తో ఫిట్‌గా ఉంటారు. ఆయన రోజువారీ కార్యక్రమాల్లో జిమ్ ( Jim ) చేయడం ఓ భాగం. ఎంత తీరిక లేకుండా ఉన్నప్పటికీ ఆయన వ్యాయామాన్ని మర్చిపోరు. అలాగే యోగా కూడా తప్పనిసరిగా చేస్తారు. ఇక ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. డైట్ ఫాలో ( Diet Food ) అవుతారు. ఆయనకు ప్రత్యేకంగా జిమ్ ఇన్‌స్ట్రక్టర్ అలాగే డైటీషియన్ సేవలు అందించేవారు ఉన్నారు. ఆరోగ్యంపై ( Health ) ఇంత జాగ్రత్త తీసుకునే గౌతంరెడ్డికి సహజంగానే ఎలాంటి అనారోగ్యాలు లేవు.
బిజినెస్ నుంచి పాలిటిక్స్‌కు వచ్చి మేకపాటి గౌతమ్ రెడ్డి సక్సెస్, మీకు ఈ విషయాలు తెలుసా
ఎంతో చురుకుగా ఉండే గౌతంరెడ్డికి ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించలేకపోతున్నారు. ఆయనకు గుండెపోటు రావడానికి కారణాలేమిటో కూడా వైద్య వర్గాలు ( Hospital ) స్పష్టంగా చెప్పలేకపోతున్నాయి. అయితే రెండు సార్లు కరోనా రావడం వల్ల ఆ ఎఫెక్ట్ ఉండి ఉండవచ్చన్న బలమైన అభిప్రాయం వినిపిస్తోంది. కరోనా వచ్చి తగ్గిపోయిన వారిలో పోస్ట్ కోవిడ్ పరిణామాలతో ( Post Covid Symptoms ) కొంతమంది ఆరోగ్యం సడెన్‌గా క్షీమించడం... గుండెపోటుకు గురవడం వంటి కారణాల వల్ల ఎక్కువ మరణాలు సంభవిస్తున్నట్లుగా వైద్య వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే ఆయనకూ ఇలాంటి సమస్య ఏదైనా వచ్చి ఉంటుందని భావిస్తున్నారు.
ఏది ఏమైనా ఎలాంటి దురలవాట్లు లేని .. పూర్తిగా ఆరోగ్య ప్రమాణాలు పాటించే వ్యక్తి హఠాత్తుగా అనారోగ్యం పాలై ..ప్రాణాలు కోల్పోవడం చాలా మందిని దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.