హైదరాబాద్‌లో మరోసారి చైన్ స్నాచింగ్ కలకలం రేగింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో వరుస గొలుసు చోరీలు వెలుగు చూశాయి. బంజారాహిల్స్‌లోని ఇందిరా నగర్‌లో మహిళ మెడలో ఉన్న రెండున్నర తులాల మంగళసూత్రం తాడును గుర్తు తెలియని దుండగులు లాక్కొని వెళ్లిపోయారు. జూబ్లీహిల్స్‌లో కూడా మరో మహిళ మెడలో గొలుసును ఓ దుండగుడు లాక్కెళ్లాడు. బాధితురాలు కృష్ణవేణి అనే 43 ఏళ్ల మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. మరోవైపు, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి సమయంలో మరో మహిళ మెడలో 2 తులాల బంగారు గొలుసు అపహరణకు గురైంది. ఓ దుండగుడు మహిళ మెడలోని గొలుసును దోచుకుపోయాడు. ఇలా ఒకే రోజు రెండు చైన్ స్నాచింగ్‌లు జరగడంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ రెండు ఘటనలు ఒకరి వల్లే జరిగిందా అని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
Also Read: మందు బాబులకు గుడ్ న్యూస్.. మద్యం విక్రయ వేళలు పొడిగింపు.. న్యూ ఇయర్ కు తగ్గేదేలే అంటారేమో..
వరంగల్‌లోనూ..
వరంగల్ నగరంలో కూడా చైన్ స్నాచింగ్ ఘటనలు చోటు చేసుకున్నాయి. దీనికి సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరు మోటారు సైకిళ్లు దొంగతనం చేయడమే కాకుండా చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. దీనికి సంబంధించి వరంగల్ ఈస్ట్ డీసీపీ ట్వీట్ చేశారు. మంగళవారం ఆయన ప్రెస్ మీట్ నిర్వహించి నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. అరెస్టు చేసిన వారి నుంచి కాజేసిన మోటారు సైకిళ్లు, 25 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లుగా డీసీపీ వెంకట లక్ష్మి తెలిపారు.
ఎరువుల లారీ చోరీ
హైదరాబాద్ శివారు చౌటుప్పల్‌లో ఆగి ఉన్న ఓ ఎరువుల లారీని దుండగులు ఎత్తుకుపోయారు. చౌటుప్పల్‌లోని ఓ ఎరువుల దుకాణానికి ఓ లారీ డ్రైవర్ లారీలో ఎరువుల లోడ్ తీసుకువచ్చాడు. ఎరువుల దుకాణం చిరునామా దొరకకపోవడంతో ఆ అడ్రస్ కోసం లారీ నుంచి కిందకు దిగాడు. ఇదే అదునుగా భావించిన దుండగులు యూరియా బస్తాల లోడ్‌తో ఉన్న లారీని ఎత్తుకుపోయారు. డ్రైవర్ దిగడాన్ని గమనించి లారీతో ఉడాయించారు. దీంతో కంగుతిన్న లారీ డ్రైవర్ లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
Also Read: తెలంగాణ నుంచి మరో 6 లక్షల టన్నుల బియ్యం కొనుగోలుకు కేంద్రం సిద్ధం.. కానీ TRSవి డ్రామాలు.. ఎమ్మెల్యే
Also Read: Telangana Omicron: తెలంగాణలో కొత్తగా 12 ఒమిక్రాన్ కేసులు... 182 కరోనా కేసులు, ఒకరు మృతి
Also Read: Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్‌కు నోటీసులిచ్చాం, అయినా.. సైబరాబాద్ కమిషనర్ వెల్లడి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి