అవసరాల కోసం తీసుకున్న అప్పులు సకాలంలో కట్టలేదని బాధితులను లొంగదీసుకున్నాడు. చేసేది చెత్త పని దాన్ని కూడా సీక్రెట్‌గా షూట్ చేశాడు. దాన్ని అడ్డం పెట్టుకొని స్నేహితులను కూడా సీన్‌లోకి తీసుకొచ్చాడు. బాధితురాలు షీం టీంను సంప్రదించడంతో సీన్ మారిపోయింది. 


హైదరాబాద్‌లో జరిగిన ఈ ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కేసు రిజిస్టర్ చేసి పరారీలో ఉన్న నిందితుల కోసం వేట సాగిస్తున్నారు. అప్పుల పేరుతో తప్పుడు పనులు చేస్తున్న వారిపై నిఘా పెట్టాలని డిసైడ్ అయ్యారు. 


అవసరం ఉందని అప్పు 


అర్జెంట్ అవసరం ఉందని ఓ యువతి తెలిన వ్యక్తి దగ్గర అప్పు తీసుకుంది. ఇచ్చిన గడువు ముగిసినా డబ్బులు సర్దుబాటు కాలేదు. అదే విషయాన్ని అప్పు ఇచ్చిన వ్యక్తికి చెప్పింది. ఏం ఫర్వాలేదు అన్నాడు. దానికి ఆమె కూడా హ్యాపీగా ఫీల్ అయింది. అయితే అప్పు తీర్చే పరిస్థితి లేనప్పుడు తన కోరిక తీర్చాలి కండిషన్ పెట్టాడు. ఎన్ని రోజులైనా డబ్బుులు సర్దుబాటు కాకపోవడంతో చివరకు ఆయనకు లొంగిపోవాల్సి వచ్చింది. 


సీక్రెట్‌గా వీడియో షూట్


ఆ యువతి గత్యంతరం లేక చేసిన పని వాడి అలవాటుగా మారిపోయింది. అవసరం ఉన్నప్పుడల్లా వచ్చిపోయేవాడు. ఈ క్రమంలోనే ఆమెకు తెలియకుండానే వారి ఏకాంతంగా టైంలో వీడియో షూట్ చేశాడు. ఆ వీడియోను ఫ్రెండ్స్‌కు చూపించాడు. వారికి షేర్ కూడా చేశాడు. 


అక్కడి నుంచి అప్పు తీసుకున్న యువతికి వాళ్లంతా కలిసి చుక్కలు చూపించారు. గంట గంటకు ఫోన్ చేసి తమ కోరిక తీర్చాలంటూ ఒత్తిడి చేశారు. అప్పు ఇచ్చిన వ్యక్తి కూడా వారికి సహాయపడ్డాడు. కుదరదని చెప్పేసిందామె. తాను అలాంటి వ్యక్తినికాదని రిక్వస్ట్ చేసింది. అయినా వాళ్లెవరూ ఊరుకోలేదు. టార్చర్ పెట్టారు. 


 


వీడియోతో బ్లాక్‌మెయిల్


మాటలతో లొంగి పరిస్థితి లేదని అప్పులు ఇచ్చిన వ్యక్తి షూట్ చేసిన వీడియోను ఆమెకు చూపించారు. ఆ వీడియో చూసిన ఆమె షాక్ తింది. తమ కోరిక తీర్చితే సరేసరి లేదంటే వీడియోలు వైరల్ చేస్తామని బాధితురాలికి బెదించారు. అయినా ఆమె అంగీకరించలేదు. ఏం చేసుకుంటారో చేసుకోండని చెప్పేసింది. 


ఫిర్యాదు అందుకున్న షీటీం


చివరకు నిందితులు అన్నంతపని చేశారు. సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో తెలిసిన వారందరికీ విషయం తెలిసిపోయింది. దీంతో ఆమె డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. తీవ్ర మానసిక క్షోభ అనుభవించింది. తెలిసిన వారి సహాయంతో షీటీమ్స్‌ను ఆశ్రయించింది  బాధితురాలు. 


పరారీలో నిందితులు 


ఫిర్యాదు అందుకున్న పోలీసులు సీన్‌లోకి ఎంటర్ అయ్యారు. వేధించిన వారి వివరాలు తీసుకొని కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నారు. వీడియో వైరల్ కావడం, పోలీసు కేసు నమోదు అయిందని తెలుసుకున్న నిందితులు ఎస్కేప్ అయ్యారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 


Also Read: 4 నెలల తర్వాత మెడికో ప్రీతి హాస్టల్ రూం ఓపెన్, 970 పేజీలతో ఛార్జిషీట్ దాఖలు


Also Read: వీడియో గేమ్‌ ద్వారా మతమార్పిడీలు, పిల్లలే టార్గెట్‌గా డేంజర్ ముఠా పన్నాగం