"బుల్లి బయ్" పేరుతో ఆన్‌లైన్‌లో ఓ వర్గం మహిళల మార్ఫింగ్ చిత్రాలు అమ్ముతున్నారంటూ తీవ్ర దుమారం రేగిన కేసులో పోలీసులు ఇద్దర్ని అరెస్ట్ చేశారు. ఇందులో ప్రధాన నిందితురాలిగా ఉత్తరాఖండ్‌కు చెందిన మహిళ ఉండగా... ఆమెకు సహకరిస్తున్న బెంగళూరుకు చెందిన ఇంజినీరింగ్ స్టూడెంట్‌ను కూడా అదుపులోకితీసుకున్నారు. బుల్లీ బయ్ అనే యాప్ లో వందల సంఖ్యలో ఓ వర్గం మహిళల ఫొటోలు పెట్టి.. వారంతా అమ్మకానికి ఉన్నారంటూ ప్రచారం చేస్తున్నారు. వేలం నిర్వహిస్తున్నారు. ఈ విషయం బయటకు తెలియడంతో ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రధాన నిందితురాలిని ఉత్తరాఖండ్‌లో అదుపులోకి తీసుకోగా.. బెంగళూరులో ఓ 21ఏళ్ల ఇంజినీరింగ్ విద్యార్థిని అరెస్ట్ చేశారు. అతడిని విశాల్ కుమార్‌గా గుర్తించారు. మరికొందరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ యాప్ కు నలుగురు ఫాలోవర్లు ఉండగా, వారిలో ఈ విద్యార్థి ఒకడని గుర్తించారు.
Also Read: కుమార్తెను కొట్టిందని టీచర్‌పై జవాన్ కాల్పులు .. కానీ గాయపడింది ఆయన భార్య ! ఎలా అంటే ...
పోలీసులు అతడిని ముంబయి తీసుకువెళ్లారు. నిందితులకు.. ఒకరితో ఒకరికి పరిచయం ఉందని ముంబయి సైబర్ సెల్ పోలీసులు ప్రకటించారు. శిససేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ఈ విషయాన్ని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్లగా ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. కావాలనే దుండగులు వేలం పేరిట ఓ వర్గానికి చెందిన మహిళల ఫొటోలు యాప్‌లో పెట్టి అల్లరిపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని గుర్తించారు. ఆరు నెలల క్రితం కూడా 'సలీ డీల్స్' పేరిట ఓ యాప్ ఇదే తరహా వ్యాపారం చేసింది. దీనిపై అప్పట్లో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసినా నిందితుల్ని పట్టుకోలేకపోయారు.
ఈ వివాదాస్పద యాప్‌లను దిగ్గజ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్‌కు చెందిన 'గిట్‌హబ్' ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని రూపొందిస్తున్నారు. దీంతో ఈ విషయంపై కేంద్రం గిట్‌హబ్‌కు సమాచారం అందించింది. పటిష్ఠ చర్యలు చేపట్టాలని కోరింది.'బుల్లీ బాయ్' యాప్ ను తమ ప్లాట్ ఫాం నుంచి తొలగించినట్టు మైక్రోసాఫ్ట్ కు చెందిన ఓపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్ వేదిక గిట్ హబ్ వెల్లడించింది. మరో వైపు బుల్లి బయ్ యాప్ బాధితులు హైదరాబాద్‌లోనూ ఉన్నారు. బుల్లి బాయ్స్ పేరుతో అసభ్యకరమైన పోస్టులు పెట్టడమే కాకుండా, అమ్మకానికి పెడుతున్నట్లు పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టోలిచౌకికు చెందిన ఓ మహిళ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read: Guruvayur Temple: భక్తులారా ఇదేమైనా న్యాయమా..? పనికిరావని హుండీలో వేస్తారా?