High Court Lawyer Avula Venkateshwarlu Is No More: కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. హైకోర్టులో న్యాయవాది ఆవుల వెంకటేశ్వర్లు అనుమానాస్పద స్థితిలో మరణించారు. హైకోర్టు లాయర్ అనుమానాస్పదంగా చనిపోవడంపై స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఇటీవల సోదరుడ్ని కలిసేందుకు వెళ్లిన హైకోర్టు లాయర్.. ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలో మృతదేహంగా కనిపించారు. న్యాయవాది వెంకటేశ్వర్లును ఎవరో హత్య చేసి ఉంటారని కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేశారు.


మూడు రోజుల కిందట అదృశ్యమై.. చివరికి ఇలా!
ఏప్రిల్ 7 నుండి ఆవుల వెంకటేశ్వర్లు కనిపించకుండాపోయారు. చింతకుంటలో నివాసం ఉండే తమ్ముని వద్దకు వెళ్లిన హైకోర్టు లాయర్ తిరుగు ప్రయాణమయ్యాక  తిరిగివస్తూ అదృశ్యమయ్యారని వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన కనిపించడం లేదని, ఎలాగైనా ఆయన జాడ కనిపెట్టాలని లాయర్ కుటుంబ సభ్యులు ఇదివరకే మహానంది పోలీసులను ఆశ్రయించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. 


కాలేజీ సమీపంలో అనుమానాస్పద స్థితిలో 
లాయర్ ఆవుల వెంకటేశ్వర్లు కర్నూలులోని టెలికాం నగర్‌లో నివాసం ఉంటున్నారు. రియల్ ఎస్టేట్ వివాదాలకు సంబంధించిన కేసులను ఆయన వాదిస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో వెంకటేశ్వర్లు కనిపించకుండా పోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు లాయర్ వెంకటేశ్వర్లు కోసం గాలింపు చర్యలు చేపట్టగా.. సోదరుడి వద్ద నుంచి తిరిగివస్తూ అదృశ్యమైన హైకోర్టు లాయర్ కర్నూలు శివారులోని సఫా ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందారని గుర్తించారు. అయితే ఇది ముమ్మాటికీ హత్యేనని ఆయన కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. 


పోలీసులు ఏమన్నారంటే.. 
కర్నూలు తాలుకా పీఎస్‌లో ఇన్‌స్పెక్టర్‌గా శేషయ్య విధులు నిర్వహిస్తున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కేసు వివరాలు వెల్లడించారు. కర్నూలు సమీపంలోని నన్నూరు టోల్ గేటు వద్ద హైకోర్టు న్యాయవాది ఆవుల వెంకటేశ్వర్లు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారని తెలిపారు. సఫా కాలేజీ వెనుక వైపు గుర్తుతెలియని మృతదేహం ఉన్నట్లు సమాచారం అందినట్లు తెలిపారు. వెంకటేశ్వర్లు తెలంగాణ హైకోర్టులో అడ్వకేట్‌గా ప్రాక్టీస్ చేస్తున్నారు. అనుమానాస్పదంగా మృతిచెందినట్లు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. పోస్టుమార్టం అనంతరం ఇది హత్యనా, లేక అనుమానాస్పద మరణమా మరేదైనా  వివరాలు తెలుస్తాయన్నారు. ఆవుల వెంకటేశ్వర్లుగా పోలీసులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.


Also Read: Warangal News : బాలికను గర్భవతి చేసిన సర్పంచ్, పోలీసు కేసు పెట్టకుండా గ్రామ పెద్దలు రాజీ ప్రయత్నాలు


Also Read: Hyderabad Crime : హైదరాబాద్ లో దారుణ ఘటన, పాత కక్షలతో యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టిన స్నేహితులు