AP DGP Rajendranath Reddy says FIR filed against MLC Anantha Udaya Bhaskar driver Subrahmanyam Death Case
తిరుపతి : వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ వద్ద డ్రైవర్‌గా పనిచేసిన సుబ్రమణ్యం మృతి కేసుపై ఏపీ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు. ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ పై కేసు నమోదు చేసి, విచారణ చేపట్టామని చెప్పారు. తిరుపతిలోని ఎస్వీ సెనెట్ హాల్‌లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సుబ్రహ్మణ్యం మెడికల్ రిపోర్టు వచ్చిన తరువాత పూర్తి స్ధాయిలో విచారణ జరుపుతామని అన్నారు. అయితే ప్రస్తుతం ప్రాథమిక విచారణ జరుపుతున్నామని, సాధ్యమైనంత త్వరగా కేసు విచారణను పూర్తి చేస్తామని వెల్లడించారు.
కొత్త జిల్లా ఏర్పాటు తర్వాత దిశ, మహిళా పోలీసు స్టేషన్లను కొత్తవి ఏర్పాటుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలియజేశారు. గత మూడేళ్లలో నేరాలు సంఖ్య గణనీయంగా తగ్గిందని, కరోనా సమయంలో క్రైం రేటును ప్రామాణికంగా తీసుకోవడం లేదన్నారు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి. ముఖ్యంగా 2019-2022 మూడేళ్లలో, గత మూడు నెలలుగా నేరాలు, హత్యల సంఖ్య బాగా తగ్గిందన్నారు. రాత్రి సమయాల్లో పోలీసు సుబ్బందితో బీట్ నిర్వహించడంతో పాటుగా, నేర చరిత్ర కలిగిన వారిపై ప్రత్యేక నిఘా ఉంచాంమన్నారు.
రాష్ట్రంలో యాక్సిడెంట్స్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన చెప్పారు. ఇక పదోవ తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ తెలుగు పరీక్షలో మాల్ ప్రాక్టీసు జరగడం వాస్తవమేనని, ఈ కేసులో పూర్తి ఆధారాలు సేకరించిన తరువాతే నారాయణను అరెస్టు చేయడం జరిగిందన్నారు. నారాయణ కేసులో నిర్లక్ష్యం వహించిన ఏసీపీ సుజాతను సస్పెండ్ చేశామని తెలిపారు. రాష్ట్రంలో గంజాయి సాగు జరగకుండా చర్యలు తీసుకోవడంమే కాకుండా, ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు.
మల్కాన్ గిరి జిల్లా నుండి గంజాయి అక్రమ రవాణాను పూర్తి స్ధాయిలో నిరోధించినట్లు ఆయన తెలిపారు.. నిషేధిక వస్తువులు అక్రమ రవాణా చేస్తే చట్టరీత్యా కఠినంగా చర్యలు తీసుకుంటాంమని, నేరాలకు పాల్పడితే ఎలాంటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు.. చిత్తూరు ఉమ్మడి జిల్లాలోని సరిహద్దుల్లో త్వరలో చెక్ పోస్టు ఏర్పాటు చేస్తాంమని తెలియజేశారు.. అంతే కాకుండా ఎర్రచందనం అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రతినిత్యం వాహనాల తనిఖీ చేపడుతున్నట్లు ఏపి డిజిపి కాసిరెడ్డి రాజేంద్రనాధ్ రెడ్డి వెల్లడించారు.
Also Read: Subrahmanyam Death Case: టీడీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు, సుబ్రహ్మణ్యం మృతి కేసులో కాకినాడ జీజీహెచ్ వద్ద ఉద్రిక్తత
Also Read: MLC Car Dead Body : వైసీపీ ఎమ్మెల్సీ కారులో డ్రైవర్ డెడ్ బాడీ, కొట్టిచంపారని కుటుంబసభ్యుల ఆరోపణ