ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలతో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన యువకుడిని సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.  హైదరాబాద్ కు చెందిన రాజుపాలెపు పవన్ ఫణికుమార్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు సీఐడీ పోలీసులు తెలిపారు.  సైబర్ క్రైమ్ ఎస్పీ రాధిక చెప్పిన వివరాల ప్రకారం... కన్నాభాయ్ అనే ట్విట్టర్ ద్వారా సీఎం జగన్ ను మానవ బాంబై చంపేస్తానని రాజుపాలెపు పవన్ ఫణికుమార్ పోస్టు పెట్టాడు. తాను పవన్ అభిమానిని అంటూ పోస్టులు పెట్టాడు. హైదరాబాద్ లో మెడికల్‌ రిప్రజెంటేషన్ గా ఇతను ఉద్యోగం చేస్తున్నాడు. ఈ పోస్టులపై ఏపీ పోలీసులకు ఫిర్యాదు రావడంతో ట్రాక్ చేసిన ఆ వ్యక్తిని అరెస్టు చేశామని సీఐడీ పోలీసులు తెలిపారు. 


Also Read:  కోమాలో ఉన్న తల్లిని కదిలించిన బిడ్డ ఏడుపు.... తల్లి ప్రేమకు నిదర్శనం ఈ ఘటన


ఫార్వార్డ్ చేసినా చర్యలు


టీడీపీ, వైసీపీ నాయకులపై పవన్ అభ్యంతరకరమైన పోస్టులు పెడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.  పోస్టులు ‌పెట్టిన వెంటనే ‌తన ఫోన్ స్విచాఫ్ చేశాడు. పోస్టులను కూడా వెంటనే డిలీట్ చేశాడు. పోస్టులు పెడితే‌‌ ఎవ్వరూ తమని ట్రేస్‌‌ చెయ్యలేరని అనుకోవద్దని, తమ దగ్గర ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో‌ పోస్టు పెట్టి వెంటనే డిలీట్ చేసినా ట్రేస్ చేయగలుగుతామని పోలీసులు తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పోస్టుల పెట్టినా, పోస్టు‌ చేసినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు అంటున్నారు.  సోషల్‌ మీడియాలో వచ్చిన పోస్టుని ఫార్వార్డ్ చేశామంటే కుదరదని,  పోస్టు చేయాలన్న వచ్చిన సమాచారం నిజమా కాదో నిర్థారణ చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. పిచ్చి రాతలు, అసహ్యకరమైన పోస్టులు, రెచ్చగొట్టే కామెంట్లు ఎవరు పోస్టు చేసినా  సైబర్ క్రైమ్ కింద శిక్షలు తప్పమని పోలీసులు హెచ్చరించారు.


Also Read: చిరంజీవికి జగన్ ఇచ్చిన హామీలన్నీ ఉత్తుత్తివేనా ? పేర్ని నాని అలా తీసి పడేశారేంటి ?


తిరుపతిలో కూడా కేసు నమోదు 


ట్విట్టర్ లో సీఎం జగన్‌పై అసభ్య పదజాలంతో కొందరు వ్యక్తులు దూషణలకు పాల్పడ్డారని వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మానవ బాంబై ముఖ్యమంత్రిని చంపేస్తానని బెదిరించిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ట్విట్టర్‌లో బిజినెస్‌మ్యాన్‌ అనే అకౌంట్‌లో కన్నాభాయ్ యూజర్‌ ఐడీ ఫేక్‌ అకౌంట్‌ నుంచి ఇలా ట్వీట్లు వచ్చాయని చెప్పారు. సీఎం జగన్‌పై ట్విట్టర్‌లో అనుచిత వ్యక్తలు చేసిన కేసు నమోదు చేయించినట్లు తిరుపతి ఎంపీ గురుమూర్తి తెలిపారు. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. విమర్శలు స్వాగతిస్తామని లైన్ క్రాస్ చేసి మాట్లాడకూడదని హెచ్చరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తిరుపతి పోలీసులు తెలిపారు. 


Also Read:  కరోనా నేర్పిన గుణపాఠం! బడ్జెట్‌లో 'బూస్టర్‌ డోస్‌' తప్పదు!!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి