ఆంధ్ర - ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దులోని మల్లంపేట గ్రామ అటవీ ప్రాంతంలో యాంటీ నక్సల్ స్క్వాడ్, సీఆర్పీఎఫ్ బృందాలు మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేస్తుంటాయి. ఈ ఆపరేషన్ లో భాగంగా మావోయిస్టుల కోసం కూబింగ్ కు వచ్చే పోలీసు బలగాలను మట్టుబెట్టేందుకు మవోయిస్టులు బూబీ ట్రాప్స్ పన్నుతున్నారు. అలాంటి 10 బూబీ ట్రాప్‌లను  భద్రతా బలగాలు గుర్తించాయి. పది అడుగుల లోతులో భూమిలో కందకాలు తవ్వి వెదురు స్తంభాలను పదునుగా చెక్కి ట్రాప్ సిద్ధం చేశారు. ఈ కందకాలపై ఆకులు కొమ్మలతో కప్పిఉంచారు. పోలీసు బలగాలను భారీ నష్టాన్ని కలిగించే ఈ బూబీ ట్రాప్ లను నిర్వీర్యం చేశారు. 


Also Read: చైనా సరిహద్దులో మళ్లీ ఘర్షణ, చొరబాటుకు యత్నం.. 200 మంది చైనా సైన్యాన్ని అడ్డగించిన భారత్


బూబీ ట్రాప్స్ అంటే... 


మావోయిస్టు ప్రభావిత అటవీ ప్రాంతాలలో భద్రతా బలగాలను రాకుండా అడ్డుకునేందుకు మావోయిస్టులు కత్తుల బావుల ఉచ్చులను పన్నుతారు. ఛత్తీస్‌గడ్‌ సరిహద్దు ప్రాంతంలోని అడవుల్లోకి ఇటువంటి బూబీ ట్రాప్స్, ల్యాండ్‌ మైన్స్ తరచూ భద్రతా బలగాలకు సవాలుగా మారుతుంటాయి. బూబీ ట్రాప్‌ ఎక్కడ ఉందో తెలుసుకోవడం భద్రతా బలగాలకు పెద్ద సవాల్. శత్రు సైన్యాన్ని మట్టుబెట్టడానికి, యుద్ధాల్లో కోటలోకి వెళ్లే మార్గాల్లో భారీ కత్తుల బావులను ఏర్పాటుచేయడం చరిత్రలో చాలాసార్లు చదువే ఉంటాం. శత్రుసైన్యాన్ని ఎదుర్కొనడానికి ప్రత్యర్థులు వేసే ఎత్తుగడ ఇది. కోట చుట్టూ పదునైన వస్తువులతో కత్తుల బావులను ఏర్పాటుచేసి శత్రువులను ఎదుర్కొనేవారు. ఇలాంటి వ్యూహాలను మావోయిస్టులు అమలు చేస్తున్నారు. శత్రువును ఎదురెదురుగా ఎదుర్కొనే సామర్థ్యం లేనప్పుడు, వారిని భయానికి లోను చేయడానికి ఇటువంటి వ్యూహాలను అనుసరిస్తుంటారు. 




ఇప్పటి వరకూ ఛత్తీస్‌గడ్‌ అటవీ ప్రాంతంలో మాత్రమే కనిపించే ఈ బూబీ ట్రాప్ లు మావో ప్రభావిత ప్రాంతాలకు విస్తరించాయి. మావోలు ఏర్పాటుచేసిన ఈ ట్రాప్ లు ఇతర ప్రాంతాల్లోనూ తరచూ బయటపడుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల అటవీ ప్రాంతంలో భారీ సంఖ్యలో బూబీ ట్రాప్స్‌లను గతంలో పోలీసు బలగాలు గుర్తించాయి. కేవలం కిలోమీటరు వైశాల్యంలో వందకు పైగా బూబీ ట్రాప్స్‌ను మావోయిస్టులు ఏర్పాటుచేశారు.  


Also Read: ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ తిరస్కరణ ... అర్బాజ్‌ఖాన్‌, మూన్‌మన్‌ ధమేచ బెయిల్ కూడా నిరాకరణ.. సెషన్స్ కోర్టుకు వెళ్లొచ్చని కోర్టు సూచన


అప్రమత్తమయ్యేలోపు దాడి


రాళ్లు, రప్పలు, చెట్టు చేమ నిండి ఉండే అటవీ ప్రాంతాలలో నడక మార్గానికి అనువుగా ఉండే ప్రదేశంలో మావోలు బూబీ ట్రాప్ లు ఏర్పాటు చేస్తారు. నాలుగు నుంచి ఐదడుగుల పొడవు, వెడల్పున, రెండుడుగుల లోతులో పదునైన కర్రలను పాతిపెడతారు. వీటిని గుర్తించకుండా ఉండడానికి తేలికపాటి కర్రలు, ఆకులతో కప్పివేస్తారు. భద్రతా బలగాలు ఆ మార్గాల్లో వచ్చినప్పుడు వీటిని గుర్తించక ప్రమాదాలు జరిగిన ఘటనలు ఉన్నాయి. పొరపాటున ఈ గుంటల్లో పడితే పదునైన ఇనుప మేకుల్లా ఉంటే కర్రలు శరీరంలోకి దిగుతాయి. ఈ గోతిలో పడి తేరుకునేలోపు మావోలు ఎదురుదాడి చేస్తారు. ఒకచోట బూబీట్రాప్‌ మరోచోట ల్యాండ్‌ మైన్‌ అమర్చుతూ భద్రతా బలగాలపై పైచేయి సాధించేందుకు మావోయిస్టులు ప్లాన్లు వేస్తుంటారు. 


Also Read: అఫ్ఘనిస్థాన్‌లో మసీదుపై ఆత్మాహుతి దాడి.. 50 మందికి పైగా మృతి.. భయానక పరిస్థితులు!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి